F3 Trailer: డబ్బున్న వాడికి ఫన్.. లేనివాడికి ఫస్ట్రేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్3. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా F3 ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 2019 సంక్రాంతి సీజన్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన F2 మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లోకంలో పంచభూతాలు అందరికీ తెలిసే ఉంటాయి. తెలియని ఓ భూతం ఉంది. అదే డబ్బు అనే మురళీ శర్మ వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. డబ్బున్న వాడికి ఫన్.. లేనివాడికి ఫస్ట్రేషన్ అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్ ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తోంది. ఈ మూవీలో మురళీ శర్మ కోటీశ్వరుడిగా కనిపించనున్నాడు. అటు హీరోలలో వెంకటేష్ రే చీకటి, వరుణ్ తేజ్ నత్తితో బాధపడుతుంటారు. వీళ్ల పాత్రల నుంచి ఫన్‌ను క్రియేట్ చేయటంతో పాటు డబ్బు, బంగారం అని ఆశపడే వారి భార్యల వల్ల హీరోలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మూవీలో దర్శకుడు అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. సునీల్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు. F2లో కనిపించిన ప్రగతి, వై.విజయ, అన్నపూర్ణమ్మ, రఘుబాబు పాత్రలు సీక్వెల్‌లోనూ కనిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ చేయడం విశేషం.
Also Read
తాజావార్తలు
-
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
-
Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తుల కీలక వ్యాఖ్యలు
-
CJP Protest: ఉద్యమం విద్యార్థులదా.? నేరస్తులదా.? ఢిల్లీ పోలీస్ రిపోర్టుల్లో సంచలన విషయాలు..
-
Tati Garelu: నోరూరించే సంప్రదాయ వంటకం..’తాటి గారెలు’ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా తయారు చేసుకోండి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ మళ్లీ గర్జించేది ఎప్పుడు? తదుపరి మ్యాచ్ ఎప్పుడు? అభిమానుల్లో ఆసక్తి
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!