Site icon NTV Telugu

Waltair Veerayya: ఈ పాట ఎలివేషన్స్ కా బాప్…

Waltair Veerayya

Waltair Veerayya

మెగాస్టార్ ని మాస్ మూలవిరాట్ అవతారంలో మళ్లీ చూపిస్తాను అని మెగా అభిమానులకి మాటిచ్చిన దర్శకుడు బాబీ, ఆ మాటని నిజం చేసి చూపిస్తున్నాడు. పోస్టర్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తూ ఒకప్పటి చిరుని గుర్తు చేస్తున్న బాబీ, చిరు ఫాన్స్ కోసం ‘వీరయ్య టైటిల్ సాంగ్’ని చాలా స్పెషల్ గా రెడీ చేసినట్లు ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బం నుంచి మూడో సాంగ్ గా బయటకి వచ్చిన ‘వీరయ్య’ టైటిల్ సాంగ్ పూనకలు తెచ్చే రేంజులో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ చెప్పిన సమయం కన్నా కాస్త ఆలస్యంగా ‘వీరయ్య సాంగ్’ని యుట్యూబ్ లో రిలీజ్ చేశారు కానీ అభిమానుల వెయిటింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ న్యాయం చేశాడు. చిరుకి టైటిల్ సాంగ్ కొట్టాలి అంటే అది దేవి శ్రీ ప్రసాద్ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసిన ‘వీరయ్య’ టైటిల్ సాంగ్ ని అనురాగ్ కులకర్నీ గూస్ బంప్స్ వచ్చే రేంజులో పాడాడు.

Read Also: Waltair Veerayya: మూడు దశాబ్దాలు అయినా బాసులో గ్రేసు తగ్గలేదు…

వాల్తేరు వీరయ్య సినిమాలో ఈ టైటిల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేలా ఉంది, ఈ రేంజ్ హై ఇంటెన్సిటీ ఉన్న సాంగ్ కి పర్ఫెక్ట్ విజువల్స్ పడితే థియేటర్స్ టాప్ లేచిపోవడం గ్యారెంటీ. వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటివరకూ వచ్చిన రెండు సాంగ్స్ ఒకెత్తు, ఈ టైటిల్ సాంగ్ ఒకెత్తు. భగ భగ అంటూ మొదలైన లిరిక్స్… తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడంటే అది వీడే, తలల్ని తీసే విషుస్టుడే వీడే అంటూ చిరు క్యారెక్టర్ ని ఎలివేట్ చేసేలా చంద్రబోస్ రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. లిరికల్ వీడియోలో అక్కడక్కడా చూపించిన విజువల్స్ లో చిరు యాక్షన్ మోడ్ లో ఆదరగొడుతున్నాడు. మొత్తానికి ఈ టైటిల్ సాంగ్ లిరిక్స్ లో ఎంత ఇంటెన్సిటీ ఉందో, దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ మధ్యలో నుంచి కొట్టిన బిట్ మ్యూజిక్ అంతే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా 1:50 నిమిషాల నుంచి ఎండ్ వరకూ రెండున్నర నిమిషాల పాటు దేవి శ్రీ ప్రసాద్ హై వోల్టేజ్ బీట్ కొట్టాడు. ఈ పాట డెఫినేట్ గా ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ కి కొత్త జోష్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లిరికల్ సాంగ్ లో చరణ్, చిరులు కలిసి కనిపించడం విశేషం.

Read Also: Waltair Veerayya: చిరు, రవితేజ కలిసి స్టెప్ వేస్తే ‘పూనకాలు లోడింగ్’ పక్కా..?

Exit mobile version