NTV Telugu Site icon

Veera Simha Reddy: ఓ పాట మినహా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ పూర్తి

Veera Simha Reddy Shooting

Veera Simha Reddy Shooting

Veera Simha Reddy Shooting Update: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంతో తెరకెక్కుతున్న ‘వీరసింహా రెడ్డి’ 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. దానికి తగ్గట్లే ప్రచారంలో దూకుడు పెంచారు. బాలయ్య లుక్ నుంచి, సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి అంశానికి అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘జై బాలయ్య…’ చార్ట్‌బస్టర్‌గా నిలవటం విశేషం. ప్రస్తుతానికి టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంతో జరుగుతోంది. బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయిక. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.