NTV Telugu Site icon

Veera Simha Reddy: ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనుమతి నిరాకరణ.. అడ్డా మార్చిన బాలయ్య

Veera Simha Reddy Event

Veera Simha Reddy Event

Veera Simha Reddy Pre Release Event Venue Changed: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన ‘వీరసింహారెడ్డి’ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల జోరుని పెంచింది. ఇందులో భాగంగానే ఈనెల 6వ తేదీన ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్స్‌లో చాలా గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే.. ఈ ఈవెంట్ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

SI Subhashree Case: లేడీ ఎస్సైని టార్గెట్ చేసి.. కత్తులతో వెంబడించి..

ఏబీఎం గ్రౌండ్స్‌లో ఈ వేడుక నిర్వహిస్తే.. పక్కాల జిల్లాల నుంచి బాలయ్య అభిమానులు ఎగబడతారని, ఫలితంగా, ఒంగోలు నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. ఒంగోలు నగరం బయట ఈవెంట్ నిర్వహించుకోవచ్చని పోలీసులు సూచించారు. దీంతో.. పోలీసుల సూచన మేరకు ‘వీరసింహారెడ్డి’ మేకర్స్ తమ అడ్డాని మార్చుకున్నారు. ఒంగోలు నగర శివారులోని అర్జున్ ఇన్‌ఫ్రా వెంచర్‌లో ఈ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. రేపు సాయంత్రానికల్లా పనులన్నీ పూర్తి చేసి, అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు రచించారు.

Online Dating Fraud: వేశ్య కోసం వెతికాడు.. దోపిడీకి గురయ్యాడు

భారీస్థాయిలో బాలయ్య ఫ్యాన్స్ తరలివచ్చినా.. వారికి అంతరాయం కలగకుండా ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. తమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. ‘అఖండ’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడం.. ఇప్పటివరకూ రిలీజైన పోస్టర్లు, ప్రోమోలు, పాటలు అన్నీ ఔట్‌స్టాండింగ్‌గా ఉండటంతో.. ‘వీరసింహారెడ్డి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Uttarpradesh: ఢిల్లీ తరహాలో మరో ఘటన.. మహిళను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు..

Show comments