Vedhika: వేయడానికి 3 గంటలు.. తీయడానికి 2 గంటలు.. ‘యక్షిణి’ కష్టాలు బయటపెట్టిన వేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ వేదిక. ఈ సినిమా తరువాత విజయదశమి, బాణం సినిమాలతో తెలుగువారికి సుపరిచితమే. ఇందులో బాణం సినిమా అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అయితే అందుకుంది కానీ, వేదికకు మాత్రం అవకాశాలు రాలేదు. అడపాదడపా తెలుగులో కనిపించిన ఆమె .. కోలీవుడ్, మాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ మధ్యకాలంలో వేదిక ఒక్క తెలుగు సినిమాలో కనిపించింది లేదు. అయితేనేం అమ్మడి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె తెలుగు ప్రాజెక్టులకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక తాజాగా బాహుబలి మేకర్లైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా అధినేత ప్రసాద్ దేవినేని నిర్మించిన ప్రాజెక్ట్ ‘యక్షిణి’తో ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రమే కాదు ఏకంగా పాన్ ఇండియన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
Tamil Star Hero: దర్శన్ లాగే జర్నలిస్టును చంపి జైలుకెళ్లిన తమిళ ‘సూపర్ స్టార్’.. ఆ కథ ఏంటో తెలుసా?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక ఈ సిరీస్ ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌తో మరోసారి వేదిక తన నట విశ్వరూపాన్ని చూపించారని చెప్పొచ్చు. తేజ మర్ని ఈ ‘యక్షిణి’ని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్‌లో యక్షిణిగా వేదిక కనిపించి ఆకట్టుకుంది. ఇది వరకు వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రాలకు భిన్నంగా ఈ వెబ్ సిరీస్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటూ ఇప్పుడు హాట్ స్టార్‌లో ట్రెండ్ అవుతోంది. అదలా ఉంచితే ఇందులో యక్షిణిగా మేకప్ వేసుకునేప్పుడు ఆమె పడిన కష్టాలను చెబుతూ ఒక బిహైండ్ ది సీన్ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె వేయడానికి 3 గంటలు.. తీయడానికి 2 గంటలు అంటూ తన మేకప్ కష్టాలు చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!