VD12: లైగర్ సినిమా భారీ పరాజయం తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హడావిడి కొంచెం తగ్గిందనే చెప్పాలి. లైగర్ విజయ్ ను ఎంత ముంచింది అంటే.. ఒకపక్క పేరు, ఇంకోపక్క డబ్బు మొత్తం కొట్టుకుపోయేలా చేసింది. దీంతో విజయ్ కెరీర్ కు కొద్దిగా బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా తరువాత కూడా విజయ్ దైర్యంగా నిలబడ్డాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ షూటింగ్ పూర్తిచేసుకోవడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మరో సినిమాను పట్టాలెక్కించాడు రౌడీ హీరో. విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD 12 ప్రకటించిన విషయం తెల్సిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ శ్రీలీల నటిస్తోంది. ఇక ఈ సినిమాలో స్పై లా కనిపిస్తున్నాడట. తాజాగా నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలయ్యింది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు మేకర్స్ తెలిపారు.
The Kerala Story: ఎట్టకేలకు సాధించారు.. కేరళ స్టోరీ బ్యాన్..?
ఇకపోతే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. జెర్సీ సినిమాతో ఓ రేంజ్ హిట్ ను అందుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. ఇప్పటికి నాని కెరీర్ లో బెస్ట్ సినిమా అంటే జెర్సీ అనే చెప్పుకొస్తారు. దీంతో ఈ కాంబో అనౌన్స్ చేయగానే అభిమానులు సైతం మరో జెర్సీని ఉహించుకుంటున్నారు. అంతేకాదు అందుకు తగ్గట్లుగానే సినిమాను ఉండాలని కోరుకుంటున్నారు. జెర్సీ లాంటి సినిమా యితే బ్రేక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నామని అభిమానులు అభయమిస్తున్నారు. మరి ఈ సినిమాతో విజయ్- గౌతమ్ ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.