Site icon NTV Telugu

Bheemla Nayak: బాబాయ్ మూవీ కోసం మరింత వెనక్కి ‘గని’!

ఈ నెల 25న రావాల్సిన వరుణ్ తేజ్ ‘గని’ సినిమా, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఆగమనంతో వెనక్కి వెళ్ళింది. అయితే ముందు ‘గని’ చిత్ర దర్శక నిర్మాతలు, ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 4న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. అలానే ఈ నెల 25న రావాల్సిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్’ చిత్రాలు మార్చి 4కు పోస్ట్ అయ్యాయి. కానీ ‘గని’ మాత్రం మార్చి 4న కూడా రాకపోవచ్చు! తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. టఫ్ టైమ్ లో తమకు బాసటగా నిలిచిన వారందరీ ప్రేమకు ఎంతో సంతోషిస్తున్నామని, ‘భీమ్లా నాయక్’ 25న రాబోతున్నందువల్ల తమ చిత్రం విడుదలను వాయిదా వేసుకున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాని తెలిపారు. అలానే అభిమానుల మాదిరిగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎప్పుడెప్పుడు వెండితెర మీద చూస్తామా! అని తామూ అంతే ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. సో… మార్చి 4న కాకుండా ‘గని’ సినిమా ఇంకాస్తంత వెనక్కి వెళ్ళేలా ఉంది.

Exit mobile version