అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు సమర్పణలో నిర్మితమౌతున్న ‘మేజర్’ మూవీ మే 27న విడుదల కాబోతోంది. దీన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అదే రోజున తమ ‘రంగరంగ వైభవంగా’ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఆ మధ్య సీనియర్ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ తెలిపారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్న చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ వెంటనే ‘కొండపొలం’ చిత్రంతో పరాజయాన్ని పొందాడు. అతను నటించిన మూడో సినిమానే ‘రంగరంగ వైభవంగా’.
Read Also : Breakup : భర్తకు బైబై చెప్పేసిన కాంట్రవర్సీ బ్యూటీ
గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగరంగ వైభవంగా’ సినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ నటిస్తోంది. అయితే… ఇప్పుడీ సినిమాకు పోటీగా వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’ మూవీ రాబోతోంది. నిజానికి ‘ఎఫ్ 3’ సినిమాను ఫిబ్రవరి నుండి నిర్మాత దిల్ రాజు ఏప్రిల్ 29కి వాయిదా వేశాడు. అయితే ఏప్రిల్ 29నే తమ ‘ఆచార్య’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిరంజీవి చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దాంతో దిల్ రాజు ఇప్పుడు తాజాగా ‘ఎఫ్ 3’ చిత్రాన్ని మే 27న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మరి ఇప్పటికే ఆ డేట్ పై ‘మేజర్, రంగరంగ వైభవంగా’ చిత్రాల నిర్మాతలు కర్చీఫ్ వేసి పెట్టారు. మరి ‘ఎఫ్ 3’కి దారి వదులుతూ ఈ రెండు సినిమాలు వేరే డేట్స్ కు వెళతాయా? లేకపోతే అదే తేదీన విడుదల అవుతాయా అనేది చూడాలి! అదే జరిగితే… మెగా ఫ్యామిలీ హీరోస్ ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ బరిలో తొలిసారి పోటీ పడినట్టు అవుతుంది.
