NTV Telugu Site icon

Varun Tej: చరణ్ అన్నకు నాకు మధ్య గొడవ.. కళ్యాణ్ బాబాయ్ అయితే నన్ను రూమ్ లో పెట్టి

Varun

Varun

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన వరుణ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. ఇక మెగా హీరో ప్రమోషన్స్ అంటే.. మెగా ఫ్యామిలీ ముచ్చట్లు లేకుండా ముగియదు. వరుణ్ కు కూడా అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. పవన్ తో బాండింగ్, చిరుతో బాండింగ్.. చిన్నప్పుడు మెగా కజిన్స్ ఎలా ఉండేవారు.. ఇలా అన్ని విషయాలను వరుణ్ అభిమానులతో పంచుకున్నాడు.

పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అన్న ప్రశ్నకు వరుణ్ మాట్లాడుతూ.. ” మొన్ననే ఆ ఇంట్లో క్రిస్టమస్ పార్టీ జరిగితే అందర వెళ్ళాం. అక్కడ గేమ్స్ అవి ఇవి పెడితే ఆడాము. అంటే బాబాయ్ తో ఎపిసోడ్ ఏం కాదు కానీ, చిన్నప్పుడు ఏంటి అంటే.. నాకు,చరణ్ అన్నకు మధ్య గొడవ జరిగేది. ట్రోల్స్ లా.. ఒక టైమ్ లో చిరంజీవి గారు, కళ్యాణ్ బాబాయ్ పెప్సీ, థంబ్సప్ యాడ్స్ చేసేవారు. ఇద్దరివీ పోటాపోటీగా వచ్చేవి. ఆ సమయంలో నేను చిరంజీవి గారి సైడ్, చరణ్ అన్న కళ్యాణ్ బాబాయ్ సైడ్ ఉండి ట్రోల్ చేసుకునేవాళ్లం. థంబ్సప్ తాగేవాళ్లు మెన్ అని.. మిగతావాళ్లు బచ్చా అని ఏదో అలా అనుకునేవాళ్లం. అయితే చిరంజీవి గారు ఇంట్లో ఉన్నంతవరకు నాకు ఫుల్ ప్రొటక్షన్ ఉండేది.. ఆయన షూటింగ్ వెళ్ళిపోగానే చరణ్ అన్నా, కళ్యాణ్ బాబాయ్ ఉండేవాళ్ళు.. వాళ్ళు నన్ను లాక్ చేసి, రూమ్ లో వేసి తలుపు వేసి, లైట్స్ ఆఫ్ చేసి భయపెట్టించారు. పెరిగేటప్పుడు చరణ్ అన్నా, కళ్యాణ్ బాబాయ్ ఒక టీమ్ లా ఉండి ఏడిపించేవారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments