Site icon NTV Telugu

VarunTej: ఈ జనరేషన్‌లో కామెడీ ఫిలిం తీయాలంటే ఒక్కడికే సాధ్యం

Varun Tej

Varun Tej

హైదరాబాద్ శిల్పకళావేదికలో F3 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. యాంకర్ సుమ ఏదైనా షోకు హోస్ట్ చేస్తే అదిరిపోతుందని ఆమెను వరుణ్ తేజ్ ఆకాశానికి ఎత్తేశాడు. F3 సినిమాతో తమకు రెండు సమ్మర్‌లు అయిపోయాయని.. 2020, 2021 సమ్మర్లు గడిచిపోయాయని.. ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వరుణ్ తేజ్ అన్నాడు. తెలుగులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా రోజులు అయిపోయిందని.. కుటుంబసభ్యులతో చూసేలా ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటించారని.. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ సినిమాలో దగా ఫ్యామిలీతో కలిసి నటించినట్లు వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.

మరోవైపు F3 సినిమాతో పాత సునీల్‌ను చూస్తారని వరుణ్ తేజ్ అన్నాడు. ఈ సినిమాలో సునీల్‌, తాను మామా అల్లుళ్లుగా నటించామన్నాడు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారని.. బీజీఎం కూడా బాగుంటుందని వరుణ్ తెలిపాడు. ఇందాక దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ గారికి ఐలవ్‌యూ చెప్పారని.. తాను అనిల్‌కు చెప్తున్నానని పేర్కొన్నారు. అనిల్ లాంటి పాజిటివ్ పర్సన్‌ను తాను చూడలేదని.. తన చుట్టూ ఉన్నవాళ్లను అనిల్ ఎప్పుడూ నవ్విస్తూ ఉంటాడని వరుణ్ వెల్లడించాడు. ప్రేక్షకులనే కాదు తమను కూడా నవ్విస్తూ ఉంటారని.. ఈ జనరేషన్‌లో కామెడీ సినిమాను అనిల్ కంటే బాగా ఎవరూ తీయలేరని వరుణ్ అభిప్రాయపడ్డాడు. F3 మూవీ అనిల్‌కు చాలా మంచి పేరు తీసుకొస్తుందని ఆకాంక్షించాడు.

విక్టరీ వెంకటేష్‌తో చాలా మంది హీరోలు మల్టీస్టారర్లు చేశారని.. ఆయనతో రెండో సారి నటించే అవకాశం తనకు మాత్రమే దక్కిందని వరుణ్ వెల్లడించాడు. దిల్ రాజు బ్యానర్‌లో తనకు ఇది హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని వరుణ్ అన్నాడు. గతంలో ఫిదా, F2 సినిమాలు చేశానని.. అవి బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయని.. ఇప్పుడు F3తో మరోసారి విజయం అందుకుంటానన్న నమ్మకం ఉందని తెలిపాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని.. ఈనెల 27న కాకుండా మళ్లీ సక్సెస్ మీట్‌లో మాట్లాడతానని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.

Exit mobile version