Varun Tej- Lavanya: నా లవ్ దొరికిందంటూ ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేసిన లావణ్య -వరుణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఈ ఎంగేజ్మెంట్ మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వరుణ్, లావణ్య కుటుంసభ్యులతో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ఉపాసన సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్ లతో పాటు పలువురు సెలెబ్రీటీలు పాల్గొన్నారు…ఇక నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు వరుణ్, లావణ్య. ‘లవ్ దొరికిందంటూ’ ఈ లవ్ బర్డ్స్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..
ఫొటోలతో పాటు 2016 లో వీరి ప్రేమాయణం మొదలు పెట్టినట్లు సీక్రెట్ ను రివిల్ చేసింది.. ఈ ఫోటోలను చూసిన పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. క్యూట్ జంట, చాలా అందంగా ఉన్నారంటు కామెంట్స్ కూడా పెడుతున్నారు.. అయితే, వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు.. వీరిద్దరూ తెలుగు, తమిళ్ళో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. కొంతకాలంగా వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగింది. ఈ యేడాది చివరిలోనే వివాహ వేడుక ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
అందుతున్న సమాచారం ప్రకారం.. వీరి వివాహాన్ని కూడా రాజస్థాన్లోని ఉదయ్ ఘడ్ ప్యాలెస్ లో చాలా ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు కూడా నిజమయ్యే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.. అంతేకాదు.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. వీరి వివాహ ఆహ్వాన పత్రికకు ఏకంగా 80 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. ఒక్కొక్క వివాహ పత్రికను బంగారు పూతతో డిజైన్ చేయించినట్లు సమాచారం. ఏదేమైనా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత రిచెస్ట్ మ్యారేజ్ లో ఇది కూడా ఒకటి కానుంది.. ఇక గతంలో నిహారిక వివాహన్ని కూడా గ్రాండ్ గా చేశారు నాగబాబు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..

