NTV Telugu Site icon

Varun- Lavanya: వరుణ్- లావణ్య శుభలేఖ చూసారా.. ఎలా ఉందో..?

Varun

Varun

Varun- Lavanya: మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న విషయం తెల్సిందే. వారి ప్రేమను అంగీకరించిన ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో కొన్ని నెలల క్రితమే వీరు సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఇండియా లో కాకుండా ఇటలీలో జరగనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. ప్రీ వెడ్డింగ్ పార్టీస్, ఫోటోషూట్స్, షాపింగ్ అన్ని పూర్తి చేశారు. ఇక నవంబర్ 1 న ఇటలీలోని టుస్కానీలో వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో అక్కడకు కేవలం ఇరు వర్గాల కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక పెళ్లి తరువాత హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

Kangana Ranaut: మహిళలలో ఆ భాగాలే కాదు ఇతర భాగాలు కూడా ఉన్నాయి.. మాజీ ఎంపీపై కంగనా ఫైర్

ఇక వరుణ్- లావణ్య పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్ గా మారుతుంది. వరుణ్‌, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్‌ చేశారు. కార్డు లోపల వరుణ్‌ నానమ్మ-తాతయ్యల పేర్లు పెట్టారు. అందులో నవంబర్ 1 న ఇటలీలో పెళ్లి జరగనుంది. నవంబర్ 5 న హైదరాబాద్ లోని N కన్వెన్షన్ లో రిస్పెషన్ ఉండనుంది అని ఉంది. ఇక ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులందరు హాజరుకానున్నారు. ఇక ఈ పెళ్ళికి సంబంధించిన పనులన్నీ ఉపాసన దగ్గర ఉండి చూసుకుంటుందని తెలుస్తోంది. మరి ఈ పెళ్ళికి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వస్తారో చూడాలి.