Site icon NTV Telugu

Varun- Lavanya: మరిది గారి పెళ్లి.. హంగామా అంతా వదినగారిదే.. ?

Ups

Ups

Varun- Lavanya: మెగా ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయుడు, హీరో, మెగా ప్రిన్స్ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యాడు. ఐదేళ్ల నుంచి ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయనున్నాడు. ఇక ఈ పెళ్ళికి వేదికగా మారింది ఇట‌లీలోని టుస్కానీ న‌గ‌రం. త్వరలోనే వీరి పెళ్లి అక్కడ అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే మెగా ఇంట్లో ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ పెళ్లి బాధ్యతలు అన్ని వదిన ఉపాసన అందుకుందని తెలుస్తోంది. మెగా ఇంటి కోడలిగా, బిజినెస్ విమెన్ గా ఆమె ఎంతో అద్భుతంగా రాణిస్తోంది. ఇక ఈ ఏడాది తల్లిగా కొత్త బాధ్యతలను కూడా అందుకుంది. రామ్ చరణ్ కు అన్ని విషయంలో సపోర్ట్ గా నిలుస్తూ వస్తుంది. ఈ పెళ్లి బాధ్యతలను కూడా ఆమె అలానే అందుకుందని సమాచారం.

Raviteja: సాగరకన్యతో టైగర్ డ్యాన్స్.. ఆ ఆటిట్యూడ్ కు ఫిదా

ఇక ఉపాసనకు ఫ్యాషన్ లో ఒక యూనిక్ టేస్ట్ ఉంది. ఆమె ధరించే డ్రెస్ లలో ఆ హుందాతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ పెళ్ళిలో కూడా వరుణ్- లావణ్య పెళ్లి బట్టల విషయంలో కూడా ఆమె తన అభిప్రాయాలను వెల్లడించిందని తెలుస్తోంది. ఇక అతిధులు ఎవరెవరిని పిలవాలి అన్నదగ్గర నుంచి వారికి ఎలాంటి భోజనం పెట్టాలి.. వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వాలి అనేది కూడా ఉపాసననే దగ్గర ఉండి చూసుకొంటుంది అంట. ఇక ఉపాసన వెంటనే.. వరుణ్ తల్లి, చెల్లి నిహారిక కూడా హెల్ప్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి మరిది గారి పెళ్ళిలోవదినగారి హంగామా ఎలా ఉంటుందో చూడాలంటే.. పెళ్లి రోజు వరకు ఆగాల్సిందే.

Exit mobile version