యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు, లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ అప్డేట్ ప్రకటించారు. ఆగస్టు 31న టీజర్ విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. కుదిరితే టీజర్ లోనే ఆ అప్డేట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రేమ, భావోద్వేగాలను పండిస్తోందని చిత్రబృందం భావిస్తోంది.