NTV Telugu Site icon

Sankranthi Movies: ‘వారిసు’కే ఎక్కువ థియేటర్స్… మూడు సినిమాల ప్రీబుకింగ్స్ స్టార్ట్!

Sankranthi Movies

Sankranthi Movies

2023 సంక్రాంతి బరిలో నిలబడుతున్న సినిమా మధ్య పోటీ రోజు రోజుకీ పెరుగుతోంది. బాలయ్య, చిరులు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేసి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలపై అంచనాలు పెంచుతుంటే దళపతి విజయ్ ఏకంగా ‘వారిసు ఆడియో లాంచ్’ వరకూ వెళ్లాడు. ప్రమోషన్స్ విషయంలో ఈ మూడు సినిమాలు వెనక్కి తగ్గట్లేదు, ఒకరిని మించి ఇంకొకరు ప్రమోషన్స్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి చిరు ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ గా నిలుస్తుంటే, ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి నందమూరి బాలకృష్ణ ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ గా నిలిచాడు. ‘వారిసు’ సినిమాకి మాత్రం దిల్ రాజు ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యి, ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ బ్రాండ్ కన్నా దిల్ రాజు బ్రాండ్ పెద్దది. అందుకే దిల్ రాజు ‘వారిసు’ సినిమాకి ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

Read Also: NTR: అమెరికాలో స్పైసీ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న తారక్…

తెలుగు రాష్ట్రాల్లో ‘వారిసు’ సినిమాకి కలిసోస్తున్న దిల్ రాజు బ్రాండ్, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి హెల్ప్ అవుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ‘వారిసు’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలకి కేటాయించిన థియేటర్స్ ని చూస్తుంటే దిల్ రాజు ఇంపాక్ట్ గట్టిగానే ఉందనిపిస్తోంది. మన స్టార్ హీరోల సినిమాలకి 400 థియేటర్స్ కేటాయిస్తే, వారిసు సినిమాకి 600 థియేటర్స్ కేటాయించారు. దాదాపు 200 థియేటర్స్ మార్జిన్ తో దిల్ రాజు ‘వారిసు’ సినిమాని ముందుండి నడిపిస్తున్నాడు. డిసెంబర్ 29న ఈ మూడు సినిమాల ప్రీబుకింగ్స్ ఓపెన్ అవ్వనున్నాయి. శ్లోక ఎంటర్టైన్మెంట్స్ బ్యానరే ‘వారిసు’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని నార్త్ అమెరికాలో రిలీజ్ చెయ్యడం విశేషం. ఓవర్సీస్ థియేటర్స్ కౌంట్ వచ్చేసింది ఇక తెలుగు రాష్ట్రాల థియేటర్స్ కౌంట్ కూడా వచ్చేస్తే… ‘వారిసు’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎంత గ్రాండ్ గా రిలీజ్ కానుందో అర్ధం అవుతుంది.

Read Also: Waltair Veerayya: మూడు దశాబ్దాలు అయినా బాసులో గ్రేసు తగ్గలేదు…

Show comments