Site icon NTV Telugu

Vardhan Puri: అవకాశాలు కావాలంటే.. కోరికలు తీర్చాల్సిందే

Vardhan Puri

Vardhan Puri

Vardhan Puri Comments On Casting Couch: కాస్టింగ్ కౌచ్ అనే భూతం సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉంది. అవకాశాలను అడ్డం పెట్టుకొని, కొందరు కామాంధులు చాలా నీచంగా ప్రవర్తిస్తుంటారు. ఆఫర్లు కావాలంటే.. తమ కోరికలు తీర్చాల్సిందేనంటూ కండీషన్లు పెడుతుంటారు. ఇలాంటి వేధింపులు కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ తప్పట్లేదు. మగవాళ్లను కూడా ఈ సమస్య వేధిస్తోందని ఇప్పటికే కొందరు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు లేటెస్ట్‌గా ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడు వర్ధాన్ పురి కూడా.. కాస్టింగ్ కౌచ్ బాధితుడినేనంటూ కుండబద్దలు కొట్టారు. తన పట్ల కూడా కొందరు దారుణంగా ప్రవర్తించారని, ఆఫర్లు కావాలంటే తమ కోరిక తీర్చాల్సిందేనంటూ కండీషన్లు పెట్టారంటూ బాంబ్ పేల్చాడు.

Rashmika Mandanna: వారిసులో ఏం లేదు.. రష్మిక షాకింగ్ కామెంట్స్

వర్ధాన్ పురి మాట్లాడుతూ.. ‘‘నేను తెరంగేట్రం చేసిన సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని.. బడా సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని, తమ కోరికలు తీర్చాలని నేరుగా అడిగారు. అయితే.. ఆ దేవుడి దయ వల్ల నేను దాన్నుంచి తప్పించుకోగలిగాను. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి, మనతో వాళ్లు దారుణంగా ప్రవర్తిస్తారు. తమ కోరికలు తీర్చుకోవాలని చూస్తారు. కొందరైతే.. డబ్బులు కూడా తీసుకుంటారు. తాము అడిగినంత డబ్బులిస్తే, మంచి సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెప్పి డిమాండ్ చేస్తారు. తీరా డబ్బులు ఇచ్చాక.. మనల్ని మోసం చేసి, కంటికి కనిపించకుండా ఉడాయిస్తారు. నన్ను కూడా ఇలాగే చాలామంది వాడుకున్నారు. అందుకే, సినిమాల విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Hibiscus Tea: మందారం టీతో లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు

కాగా.. తాత వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వర్ధాన్, 2019లో ‘యే సాలీ ఆషిఖీ’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. రిలీజ్‌కి ముందు ఈ సినిమాకు మంచి హైప్ అయితే వచ్చింది కానీ, రిలీజ్ అయ్యాక తేలిపోయింది. ఇది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక అప్పటి నుంచి ఒక మంచి సినిమా చేసి, తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాను కాస్టింగ్ కౌచ్ అనుభవాలను చవిచూశానని వర్ధాన్ పేర్కొన్నాడు.

Exit mobile version