Varalaxmi Strong Comments on Critics and Reviewers: మే 3న రిలీజ్ కాబోతున్న శబరి ప్రమోషన్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ బిజీబిజీగా ఉంది. తెలుగుతో పాటు మిగతా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను కొత్త దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాతో ముచ్చటించిన వరలక్ష్మి శరత్ కుమార్ రివ్యూస్ అందించే వారిపై కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించింది. పబ్లిక్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి సాధారణ క్రిటిక్స్ కి సినిమా వల్ల చాలా పెద్ద పనే పడింది. వాళ్లు కావాలని సినిమా మీద చెడుగా చెబుతూ ఉంటారు. కానీ ఒక్కరోజు సినిమా ఆపితే వాళ్ళకి ఏం పని ఉంటుంది. అది వాళ్ళ ఆలోచించరు, ఏదో సినిమాలో మొదటి పది నిమిషాలు లేదా 20 నిమిషాలు బాలేదని లేకపోతే ఆ సీక్వెన్స్ బాలేదని ఈ సీక్వెన్స్ బాలేదని వంకలు పెడతారు. అసలు మొత్తానికి సినిమా లేదంటే ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? అని ఆమె ప్రశ్నించింది.
Varalaxmi: వారిపై వరలక్ష్మీ ఘాటు వ్యాఖ్యలు.. ముఖం లేదు, వాల్యూ లేదు.. చెప్పు తీసుకుని కొడతారంటూ!
అయితే మీరు రివ్యూస్ ఫాలో అవుతారా అని అడిగితే తాను అస్సలు రివ్యూస్ ఫాలో అవ్వనని, రివ్యూస్ ఫాలో అయ్యే వారిని తిడతానని చెప్పుకొచ్చింది. సినిమాలకి రివ్యూ చేయడానికి మీకు ఏం అర్హత ఉంది? హాలీవుడ్ విషయానికి వస్తే ఒక పరీక్ష లాంటిది పెట్టి సినిమాలన్నీ రివ్యూ చేసే వాళ్ళని అనుమతిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఎవరైనా ఎలా అయినా రివ్యూ చెప్పడానికి రెడీ అయిపోతారంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక్కడ వాళ్లు మాత్రం సినిమా మీద ఏ అవగాహన లేకుండా ఇంటి నుంచి థియేటర్కు వచ్చేసి రివ్యూ చెబుతానని రెడీ అయిపోతారు. అలా చెప్పడానికి మీకేం అర్హత ఉంది? అసలు మీకేం హక్కు ఉంది అలా సినిమాని రివ్యూ చేయడానికి. అందుకే నా దగ్గరికి వచ్చి ఎవరైనా రివ్యూ చూశారా అని అడిగితే నాకు చాలా కోపం వస్తుంది. నువ్వు సినిమా చూశావా? నీకు సినిమా నచ్చిందా? లేదా అంతవరకే అక్కడితో వదిలెయ్. సినిమా నచ్చిందా? లేదా? అనేది నీ అభిప్రాయం.
నీ అభిప్రాయం ఏంటో నువ్వు ఏర్పరచుకో. ఎవరో ఇడియట్ చెప్పిన అభిప్రాయాన్ని నీ అభిప్రాయంగా మార్చుకోవద్దు అని ఆమె కామెంట్ చేశారు. ఒక సినిమా ఎంత కష్టమో చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూలు ఇవ్వకుండా ఒక నాలుగు ఐదు రోజులు ఆపితే ఆడియన్స్ సినిమా చూడాలా వద్దా అని వాళ్లకు వాళ్లే డిసైడ్ అవుతారు. ఆడియన్స్ కి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆమె పేర్కొన్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి అని అడిగితే చెడు జరుగుతుంది అని ఎలా భావిస్తారో థియేటర్ కి వెళ్లే లోపే సినిమా బాలేదు అనేది మైండ్లో పడితే ఆ బాలేదు అనే ఉద్దేశంతోనే సినిమా చూసి బాలేదని ఫిక్స్ అవుతారు. కాబట్టి వాళ్లని ప్రభావితం చేయకండి అని ఆమె పేర్కొన్నారు. ఒక సినిమా బాలేదు అని చెప్పే ముందు, నిజంగా అసలు ఆ సినిమా చేయకపోతే మీరేం చేస్తారో ఆలోచించండి. సినీ పరిశ్రమ లేకపోతే మీ పరిస్థితి ఏమిటో ఆలోచించండి అంటూ ఆమె కామెంట్స్ చేసింది.