NTV Telugu Site icon

Varalaxmi Sarathkumar: నన్ను చంపేస్తారనుకున్నా.. వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్

Varalaxmi On Veera Simha

Varalaxmi On Veera Simha

Varalaxmi Sarathkumar On Veera Simha Reddy Interval Block: ఒకప్పుడు కోలీవుడ్‌లో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయ్యింది. కీలక పాత్రలతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్స్‌ కూడా చేస్తోంది. ఈమధ్య తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలే పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీరసింహారెడ్డిలో ‘భానుమతి’ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించి మెప్పించింది. ఇందులో అది బాలయ్య చెల్లెలు పాత్ర కాబట్టి, ఆమెకు మంచి పేరే వచ్చింది. ఇంటర్వెల్‌లో వీరసింహారెడ్డిని పొడిచి చంపే రోల్ కాబట్టి.. సినిమాలో వరలక్ష్మీ రోల్ బాగా హైలైట్ అయ్యింది. అయితే.. ఆ సన్నివేశం తనని భయాందోళనలకు గురి చేసిందని, అది చూశాక బాలయ్య అభిమానులు ఎక్కడ తనని చంపుతారోనని భయపడ్డాడనని వరలక్ష్మి కుండబద్దలు కొట్టింది. ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో ఆమె ఆ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

Ladies Hostel Robbery: లేడీస్ హాస్టల్‌లో చోరీ.. బావిలో బుక్కైన చోర్

వరలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘బాలయ్యని పొడిచి చంపే సీన్ చేస్తున్నప్పుడు నేను చాలా భయపడిపోయా. ఆ సీన్ చూశాక బాలయ్య ఫ్యాన్స్ తనపై పగ పెంచుకొని, ఎక్కడ తనని చంపుతారేమోనని ఆందోళనకి గురయ్యా. అయితే.. బాలయ్య నాలో ధైర్యం నింపారు. తన అభిమానులు ఆ సన్నివేశాన్ని నెగెటివ్‌గా తీసుకోరని, తన ఫ్యాన్స్ బాగానే రిసీట్ చేసుకుంటారని బాలయ్య చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మీరందరూ (బాలయ్య ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) ఆ సీన్‌ని రిసీవ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్’’ అంటూ చెప్పుకొచ్చింది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ చూసి తాను షాక్‌కి గురయ్యానని, ఆ ఫైట్స్ చూస్తూ తానూ ‘‘జై బాలయ్య’’ అంటూ గట్టిగా అరిచానని తెలిపింది. ఇక తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమానే లేదని, ప్రతి షాట్‌లోను తనకు గూస్‌బంప్స్ వచ్చాయని తెలిపింది. ఈ సినిమా తర్వాత తాను బాలయ్యకు పెద్ద ఫ్యాన్ అయిపోయానంది. భానుమతి పాత్రని ఇంత గొప్పగా డిజైన్ చేసినందుకు దర్శకుడు గోపీచంద్ మలినేనికి వరలక్ష్మి ధన్యావాదలు తెలిపింది.

Singer Mangli: నాపై దాడి జరగలేదు.. అవన్నీ ఫేక్ వార్తలు