NTV Telugu Site icon

Varalaxmi Sarathkumar: పిచ్చి పిచ్చి రాతలు రాస్తే.. పరువు నష్టం దావా వేస్తా..

Varu

Varu

Varalaxmi Sarathkumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చినా అవి సెట్ అవ్వకపోయేసరికి అమ్మడు విలనిజం మీద పడింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బక్కచిక్కి స్టార్ హీరోలకు ధీటుగా విలనిజాన్ని పండిస్తూ వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది. తెలుగు, తమిళ్ లో ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తున్న వరూ .. ఈ మధ్యనే ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్‌ తో నిశ్చితార్థం చేసుకుంది. ఇక అంతా హ్యాపీగానే ఉన్నా.. అమ్మడిని ఆ డ్రగ్స్ కేసు మాత్రం వదలడం లేదు. గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో వరలక్ష్మీ శరత్‌కుమార్ మాజీ అసిస్టెంట్ ఆదిలింగం అరెస్టయ్యాడు. అతనికి డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికర్లతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెడుతున్నారని గుర్తించారు. అందుకే ఆదిలింగం గతంలో పీఏగా పనిచేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను కూడా విచారించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. ఈ విచారణకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు కూడా సమన్లు ​​అందాయని, ఎన్‌ఐఏ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని ఆమె కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక సమయం ముగిసినా ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. ఇక ఈ విషయమై వరలక్ష్మీ సీరియస్ అయ్యింది. ఇదేనా రియల్ జర్నలిజం అంటూ మీడియాపై ఫైర్ అయ్యింది.

తన సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. ” మన ప్రతిభావంతులైన మీడియాకు పాత నకిలీ వార్తలను ప్రసారం చేయడం కంటే వార్తలు లేకపోవడం చాలా విచారకరం. మా ప్రియమైన జర్నలిస్టులు ప్రత్యేకించి తమకు తాము అనుకోని రాసే వార్తల సైట్‌లు మీరెందుకు రియల్ జర్నలిజం చేయకుడు. మా ప్రముఖులలో లోపాలను కనుగొనడం మానేయండి. మేము నటించడానికి, ప్రజలను అలరించడానికి మరియు మా పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాము..మీరు మీ పనిని ఎందుకు చేయకూడదు? దేశంలో 1000 తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.. వాటిపై మీరు శ్రద్ద పెట్టండి. మా మౌనాన్ని బలహీనతగా భావించవద్దు. పరువు నష్టం కేసులు కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి.. ఫేక్ ట్రాష్ నిరాధార వార్తలను ప్రసారం చేయడం ఆపండి. ప్రజలు గర్వపడే వార్తలను రాసి రియల్ జర్నలిజం చేయండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.