Double Ismart : రామ్ కారణంగానే షూటింగ్ ఆగిపోయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని ,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”డబుల్ ఇస్మార్ట్”.. ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.గతంలో వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .రామ్ కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది .ఈ సినిమాలో రామ్ ఆటిట్యూడ్ ,డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి .ఇస్మార్ట్ శంకర్ తో రామ్ ,పూరి జగన్నాధ్ కెరీర్ మళ్ళీ ట్రాక్ లో పడింది . కానీ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఎక్కువ కాలం నిలువలేదు.ఈ సినిమా తర్వాత రామ్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.అలాగే లైగర్ సినిమా తో పూరి జగన్నాధ్ కు బిగ్గెస్ట్ ప్లాప్ ఎదురైంది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మరోసారి వీరిద్దరు కలిసారు.
వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ”డబుల్ ఇస్మార్ట్” మూవీని అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ కూడా లాక్ చేసారు. కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేకపోయింది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో కూడా క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఏకంగా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి రామ్ కారణం అనే ప్రచారం జరుగుతుంది. రెమ్యునరేషన్ పూర్తిగా ఇస్తేనే షూటింగ్ చేస్తానని రామ్ చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని సమాచారం. ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగా కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ వాయిదా వేసినట్లు సమాచారం.ఈ మూవీని రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోవడానికి రామ్ ఓకే చెప్పాడట. దీనితో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోవడానికి కారణం కాదని క్లారిటీ వచ్చింది .
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు