NTV Telugu Site icon

Varalaxmi: వరలక్ష్మీ కాబోయే భర్త కండలపై కామెంట్స్.. ప్రభాస్ పేరు చెప్పి నోరు మూయించేసిందిగా!

Varalaxmi

Varalaxmi

Varalaxmi Counter to Memer on her Would be muscles: వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆమె నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కొన్నాళ్ల క్రితం ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. వరలక్ష్మి ముంబయికి చెందిన గ్యాలరిస్ట్‌ను ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్‌ సచ్‌దేవ్‌ గ్యాలరిస్ట్‌, బాడీ బిల్డర్ కూడా. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వరలక్ష్మీతో ప్రేమలో పడడంతో అది పెళ్లికి దారి తీసింది. వరలక్ష్మి మే మూడో తేదీన శబరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మహేంద్ర అనే కొత్త నిర్మాత ఈ సినిమాని నిర్మించాడు.

Salman Khan Firing Case: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్.. అక్కడి నుంచే అంతా?

తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో మీమర్స్ తో ఇంటరాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఒక మీమర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పేరు లాగుతూ ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. సదరు మీమర్ లీడర్ సినిమాలో కండలు పెంచిన వారికి మంచి మనసు ఉండదు అనే ఒక డైలాగ్ ఉంటుంది. కానీ మీరు చేసుకోబోయే వ్యక్తి అలాగే కండలు పెంచి కనిపిస్తున్నారు. అంతలా ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ మీకు కనిపించాయి అని ప్రశ్నిస్తే ఈ మాటే లాజికల్గా లేదని వరలక్ష్మి కొట్టిపారేసింది. తాను ప్రభాస్ గురించి చాలా మంచి మాటలు విన్నానని, ప్రభాస్ కూడా కండలు పెంచి కనిపిస్తూ ఉంటాడు కదా. మరి ఆయనది మంచి మనసే కదా, అసలు మీరు చెబుతున్న లాజికే కరెక్ట్ గా లేదు అంటూ ఆమె షాకింగ్ సమాధానం ఇచ్చింది.

Show comments