Varalaxmi: వరలక్ష్మీ కాబోయే భర్త కండలపై కామెంట్స్.. ప్రభాస్ పేరు చెప్పి నోరు మూయించేసిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Counter to Memer on her Would be muscles: వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆమె నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కొన్నాళ్ల క్రితం ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. వరలక్ష్మి ముంబయికి చెందిన గ్యాలరిస్ట్‌ను ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్‌దేవ్ గ్యాలరిస్ట్, బాడీ బిల్డర్ కూడా. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వరలక్ష్మీతో ప్రేమలో పడడంతో అది పెళ్లికి దారి తీసింది. వరలక్ష్మి మే మూడో తేదీన శబరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మహేంద్ర అనే కొత్త నిర్మాత ఈ సినిమాని నిర్మించాడు.
Salman Khan Firing Case: సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్.. అక్కడి నుంచే అంతా?
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగులో మీమర్స్ తో ఇంటరాక్ట్ అయింది. ఈ సందర్భంగా ఒక మీమర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ పేరు లాగుతూ ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. సదరు మీమర్ లీడర్ సినిమాలో కండలు పెంచిన వారికి మంచి మనసు ఉండదు అనే ఒక డైలాగ్ ఉంటుంది. కానీ మీరు చేసుకోబోయే వ్యక్తి అలాగే కండలు పెంచి కనిపిస్తున్నారు. అంతలా ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ మీకు కనిపించాయి అని ప్రశ్నిస్తే ఈ మాటే లాజికల్గా లేదని వరలక్ష్మి కొట్టిపారేసింది. తాను ప్రభాస్ గురించి చాలా మంచి మాటలు విన్నానని, ప్రభాస్ కూడా కండలు పెంచి కనిపిస్తూ ఉంటాడు కదా. మరి ఆయనది మంచి మనసే కదా, అసలు మీరు చెబుతున్న లాజికే కరెక్ట్ గా లేదు అంటూ ఆమె షాకింగ్ సమాధానం ఇచ్చింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!