Vanitha Vijay Kumar: సొంతవాళ్లే ఇంట్లో నుంచి గెంటేశారు.. నా తండ్రే నన్ను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vanitha Vijay Kumar: సీనియర్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి కోలీవుడ్ అయినా తెలుగులో కూడా మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యాడు. ఇక తెలుగు నటి మంజులను వివాహమాడి మరింత దగ్గరయ్యాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు. వనితా విజయ్ కుమార్, ప్రీతీ విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్.. ఇక హీరో అరుణ్ విజయ్ కూడా ఆయన కుమారుడే. వీరందరూ కూడా ఇండస్ట్రీలో ఉన్నవారే. ఇక వీరందరి కన్నా వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయ్యింది వనితా విజయ్ కుమార్. రుక్మిణి అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన వనితా.. ఆ తరువాత కోలీవుడ్ లో మంచి సినిమాలు తీసి మెప్పించింది. ఇక దేవి సినిమా తరువాత ఆమెకు వివాహం కాగా, అప్పటినుంచి ఆమె ఇంటికే పరిమితమయ్యింది. ఆ తరువాత తన భర్తతో విబేధాలు.. పిల్లల కోసం పోరాటంతో మీడియా ముందుకు వచ్చింది. ఈ వివాదం కాగానే.. తండ్రి ఆస్తి తగాదాలతో మరింత వివాదాస్పదమయ్యింది. ఇక ఇప్పుడు ఆమె నరేష్- పవిత్ర జంటగా నటించిన మళ్లీ పెళ్లి చిత్రంలో రమ్య రఘుపతి పాత్రలో నటించింది. ఈ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గతం తాలూకూ చేదు జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది. ఆస్తి కోసం సొంత వాళ్ళే తనను ఇంటి నుంచి గెంటేసినట్లు చెప్పుకొచ్చింది.
Hidimbha Trailer: అమ్మాయిలను అతికిరాతకంగా చంపుతున్న ‘హిడింబ’ ఎవరు..?
Also Read
“నా తండ్రికి, నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వన్నని ఆయన ముఖం మీద చెప్పాడు. మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. ఆమె ఉన్నప్పుడు వీరెవ్వరు మాట్లాడేవారు కాదు. ఆమె చనిపోయాక నన్ను వీళ్ళు దూరం పెట్టారు. ఇంటి నుంచి గెంటేశారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక మైసూర్ లో పిల్లతో కలిసి చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపాను. ఇక ఒకరోజు మా నాన్నకు కాల్ చేసి.. ఎందుకు నాన్న .. అన్ను ఇలా వేధిస్తున్నారు.. అమ్మ ఉంటే నాకు ఇలా జరగనిచ్చేదా అని అడిగితే.. తమిళనాడులో నువ్వు కాలు కూడా పెట్టలేవు. ఒకసారి వచ్చి చూడంటూ సవాలు విసిరారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?