Site icon NTV Telugu

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ!

‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్! తొలి చిత్రం విడుదలకు ముందు క్రిష్‌ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా రెండో సినిమాను చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ మూవీ విడుదలకు ముందే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా. ఈ యేడాది ఏప్రిల్ 2న ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కేతికా శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కాస్తంత తగ్గుముఖం పట్టడంతో మంగళవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించామని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ‘ఉప్పెన’ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన దేవిశ్రీ ప్రసాద్… వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మూడో చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం.

Exit mobile version