పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా తెలిసింది ఫాన్స్ కి మాత్రమే. అందుకే ఆ ఫాన్స్ నుంచే ఒకరు బయటకి వచ్చి, పవన్ కళ్యాణ్ ని గబ్బర్ సింగ్ గా మార్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అసలు హిట్ ఫ్లాప్ అనేది మ్యాటర్ కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా కనిపించాడు? ఎంతలా ఎంటర్టైన్ చేశాడు అనేది మాత్రమే మ్యాటర్. పవన్ కళ్యాణ్ ని అభిమానులకి నచ్చేలా ప్రెజెంట్ చేస్తే చాలు బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనే విషయం స్పష్టంగా తెలిసిన పవన్ అభిమాని హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇలానే కదా ఉండాలి, ఇలా కాదా ఎంటర్టైన్ చెయ్యల్సింది అనిపించే రేంజులో హరీష్ శంకర్, పవన్ ని ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా కొట్టిన హిట్ దశాబ్దం పాటు రీసౌండ్ లా వినిపిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించినట్లు ఇంకొకరు చూపించలేరు అనే కామెంట్ పుష్కర కాలంగా వినిపిస్తూనే ఉంది.
ఈ మాటని మరో పుష్కరం పాటు వినిపించేలా చెయ్యడానికి హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ లు కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. ఇటివలే సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ అవ్వగానే అభిమానుల అంచనాలు, ట్రేడ్ వర్గల లెక్కలు ఆకాశాన్ని తాకాయి. ఆకాశం మాకు హద్దు కాదు అని చాటి చెప్తూ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫాన్స్ కి మరింత కిక్ ఇస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ని పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ స్వాగ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ ముస్లిమ్స్ ఉండగా… ఫోర్ గ్రౌండ్ లో పోలిస్ బ్యారికేడ్ పైన చెయ్ పెట్టి, ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. షర్ట్ బటన్స్ అన్నీ వదిలేసి, ఒక్కటి మాత్రమే పెట్టి… బ్లాక్ గాగుల్స్ తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసాడు.
టికెట్ వర్త్ పోస్టర్ ని గిఫ్ట్ గా ఇవ్వడంతో పవన్ ఫాన్స్ అంతా హరీష్ శంకర్ కి గుడి కట్టినా తప్పులేదు మావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజమే నిన్నటి వరకూ పవన్ ఫాన్స్ హరీష్ శంకర్ ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. గోల చేసిన వాళ్లతోనే గుడి కట్టినా తప్పులేదు అనే రేంజ్ కాంప్లిమెంట్స్ అందుకోవడం గొప్ప విషయం. అందుకే అంటారు హరీష్ శంకర్ ప్రెజెంట్ చేసినట్లు పవన్ కళ్యాణ్ ని ఇంకొకరు ప్రెజెంట్ చెయ్యలేరు. పీరియడ్. మరి ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హరీష్ శంకర్ అండ్ టీం ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ తో ఎలాంటి సంచనలం సృష్టిస్తారో చూడాలి.
A saviour with style and swag ❤️🔥
And we call him – #UstaadBhagatSingh 🔥🔥🔥
Get ready for the #UBSMassGlimpse today at 4.59 PM ❤️🔥❤️🔥❤️🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/ad5ISFDbl2
— Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2023