NTV Telugu Site icon

Urvashi: నా భర్తనే నా చేత బలవంతంగా తాగించి.. తాగుబోతును చేశాడు

Urvashi

Urvashi

Urvashi: ఊర్వశి.. ఈ పేరు వినగానే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అని అనుకోకండి. ఈ ఊర్వశి వేరు. ఒకప్పుడు తమిళ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి.. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది. తెలుగులో కూడా ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే ఆమె ఎంత మంచి నటి అయినా కూడా ఇండస్ట్రీలో ఆమెను తాగుబోతుగానే చూస్తారు. మద్యానికి బానిసగా మారిన ఊర్వశి .. దానివల్లనే తన కెరీర్ ను నాశనం చేసుకుందని చెప్పుకొస్తారు. మద్యానికి బానిసలుగా మారి .. జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్స్ లో మొదట సావిత్రి ఉండగా .. ఆ తరువాత ఊర్వశి అని చెప్పుకొస్తారు. అంతలా ఆమె తాగుడుకు బానిసలా మారింది. ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. ఎంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడి వల్లనే ఆమె ఇలా తాగుబోతుగా మిగిలిపోయింది. ఇప్పటివరకు ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్నీ వెల్లడించింది.

Chiranjeevi: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇకపై వాటికి నో ఛాన్స్..?

“హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించాను. ఆ సమయంలోనే నటుడు మనోజ్ కె. జయన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం.. ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. 2000 సంవత్సరంలో మాకు పెళ్లి అయ్యింది. వాళ్ళింట్లో అందరికి తాగుడు అలవాటు ఉంది. కుటుంబం మొత్తం కూర్చొని తాగేవారు. నేను వెళ్ళాక.. నన్ను కూడా తాగమని బలవంతం చేశారు. అలా నేను మొదటిసారి తాగాను. ఇక ఆ అలవాటు వ్యసనంలా మారింది. కొన్నేళ్ళకు ఆ వ్యసనం పేరు చెప్పి.. అతను నాకు విడాకులు ఇచ్చాడు. నా బిడ్డను నాకు కాకుండా చేశాడు. నేను ముందుకు బానిసగా మారాను అని, బిడ్డను సరిగ్గా పెంచలేవు అని.. నా కూతురు బాధ్యతను కూడా వారే తీసుకున్నారు. అదంతా చూశాకా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను .. ఒంటరిదాన్నిగా ఉండిపోయాను. ఆ సమయంలోనే నా ఫ్యామిలీ ఫ్రెండ్ శివ ప్రసాద్ నాకు అండగా నిలిచాడు. 40 ఏళ్ళ వయస్సులో నేను ఆయనను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని.. వాటిని నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను నా భర్త, కొడుకుతో సంతోషంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఊర్వశి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments