Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిత్యం ఫోటోషూట్లతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ బ్లాక్ రోజ్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో తనకు వచ్చిన పెళ్లి ప్రతిపాదనల గురించి ఏకరువు పెట్టింది. మీకు ఇప్పటివరకు ఎన్నో పెళ్లి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి. అందులో ఒక క్రేజీ ప్రపోజల్ గురించి చెప్పమని అడగగా ఊర్వశి ఈ విధంగా చెప్పుకొచ్చింది. “నేను కొన్నేళ్ల క్రితం ఒక ఈజిప్టు సింగర్ తో కలిసి ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశాను. అతడ్ని నేను దుబాయ్ లో కలిశాను. పని మొత్తం పూర్తయ్యి వెళ్ళేటప్పుడు అతడు నాకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అప్పటికే ఆ సింగర్ కు ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలు ఉన్నారు. నన్ను బాగా చూసుకొంటానని చెప్పుకొచ్చాడు. నేను ఏమి మాట్లాడకుండా ఇండియా వచ్చేశాను. నాకు మన సంస్కృతీ సంప్రదాయాలపై నమ్మకం ఉంది.
ఒక మహిళ గా కుటుంబం గురించి అన్ని తెలుసుకోవాలనుకుంటాను. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది మన సంప్రదాయాలకు విరుద్ధమని నేను గ్రహించాను. ఇదొక్కటే నాకు వచ్చిన క్రేజీయెస్ట్ పెళ్లి ప్రపోజల్.. ఇది కాకుండా చాలా ప్రతిపాదనలు వచ్చాయి. అయితే పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆ సింగర్ ఎవరా అని ఆరా తీయడం, కనిపెట్టడం కూడా జరిగిపోయాయి. సదురు సింగర్ పేరు మహ్మద్ రమదాన్ అని తెల్సింది. గతేడాది అతడితో కలిసి ఊర్వశి ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది. ఈ ఆల్బమ్ కోసం అమ్మడు దాదాపు రూ. 15 కోట్లు విలువ చేసే దుస్తులు, ఆభరణాలు ధరించిందని టాక్.