NTV Telugu Site icon

Upendra: ఇలాంటి టీజర్ ని ఉప్పీ మాత్రమే కట్ చేయగలడు…

Upendra

Upendra

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర ఏం చేసినా సెన్సేషనే. గతంలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు ఉప్పి. ఇక ఇప్పుడు మరో కొత్త లోకాన్ని పరిచయం చేయబోతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తనే డైరెక్ట్ చేస్తూ నటించిన సినిమా UI. ఈ సినిమా టైటిల్, టీజర్‌తోనే అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయాడు ఉపేంద్ర. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బెంగళూరులోని ఊర్వశి థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే థియేటర్లో టీజర్ ప్లే చేసినప్పుడు ఒక్కసారిగా అంతా చీకటిగా మారిపోయింది. విజువల్ లేకుండా కేవలం ఆడియో మాత్రమే వినిపించడంతో.. ఇదేదో టెక్నికల్ ఎర్రర్ అనుకున్నారు అభిమానులు కానీ చివరికి ఉప్పి ఇచ్చిన షాక్‌తో కొన్ని క్షణాల పాటు తేరుకోలేకపోయారు.

Read Also: Bigg Boss Telugu 7: నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్.. ఈ వారం వెళ్ళేది?

ఉపేంద్ర UI సినిమా టీజర్‌ను… విజువల్ లేకుండా కేవలం మ్యూజిక్ అండ్‌ డైలాగ్‌ వెర్షన్‌తోనే రిలీజ్ చేశాడు. ‘చీకటి.. అంతా చీకటి.. అసలు ఇది ఎలాంటి చోటు? అంటూ.. రెండు నిమిషాల టీజర్‌తో భయపెట్టేశాడు ఉప్పి. ఈ చీకటి నుండి తప్పించుకోవడం ఎలా? ఇది ఏఐ వరల్డ్ కాదు.. ఇది యూఐ వరల్డ్. ఇక్కడ నుండి తప్పించుకోవాలంటే నీ బుద్ధి బలాన్ని ఉపయోగించాలి.. ఈ టీజర్ మీ ఊహకోసమే’ అంటూ ఫైనల్ టచ్ ఇచ్చాడు. ఇదంతా కేవ‌లం బ్యాక్ గ్రౌండ్‌ వాయిస్ ఓవ‌ర్ మాత్ర‌మే. దీంతో ఆ చీక‌టి వెనుక ఏం జ‌రుగుతోంది? అనేది ఎగ్జైటింగ్‌గా మారింది. మొత్తంగా ఈ ఒక్క టీజర్‌తో చీకట్లో వణుకు పుట్టించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఉపేంద్ర.

Show comments