Upendra Birthday Special : విలక్షణంతోనే సలక్షణంగా సాగుతున్న ఉపేంద్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన తీరే వేరు అంటూ సాగుతున్న నటదర్శకరచయిత ఉపేంద్రకు కన్నడనాట తరగని క్రేజ్ ఉంది. తెలుగునేలపైనా ఉపేంద్రకు ఉన్న ఆదరణ తక్కువేమీ కాదు. నలుగురు నడచిన బాటలో కాకుండా, తనదైన పంథాలో పయనించి నలుగురినీ మెప్పిస్తున్న ఘనుడు ఉపేంద్ర. నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా ఉపేంద్ర పలు పాత్రలు పోషిస్తూనే జనాన్ని ఆకట్టుకుంటున్నారు. డొంక తిరుగుడు లేకుండా, ముక్కుసూటిగా మాట్లాడటం ఉపేంద్ర నైజం. అందుకే ఆయన సినిమాల్లోనూ ఆ విలక్షణం కనిపిస్తూ ఉంటుంది. అదే జనాన్ని మైమరిపిస్తూ ఉంది. అందుకే ప్రేక్షకులు ‘ఉప్పి’ అంటూ అభిమానంగా ఆయనను ఆరాధిస్తున్నారు.
కన్నడ సీమలోని ఉడిపి సమీపంలో ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు ఉపేంద్రరావు. 1969 సెప్టెంబర్ 18న జన్మించిన ఉపేంద్ర బెంగళూరులోని ఏపీయస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బి.కామ్., చదివారు. చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు రాయడం, వాటిలో నటించడం అంటే ఉపేంద్రకు ఎంతో ఇష్టం. అతని హంగామా చూసి మిత్రులు సినిమాల్లో చేరిపో అంటూ ప్రోత్సహించేవారు. ప్రముఖ కన్నడ నటదర్శకుడు కాశీనాథ్ ఉపేంద్రకు దూరపు బంధువు. డిగ్రీ పూర్తి కాగానే, కాశీనాథ్ వద్ద అసోసియేట్ గా చేరిపోయారు ఉపేంద్ర. ఆయన దగ్గర పనిచేస్తూనే తన మనసుకు నచ్చిన కథలను రాసుకుంటూ ఉండేవారు. కాశీనాథ్ తెరకెక్కించిన ‘అనంతన అవాంతర’ అనే కన్నడ సినిమాకు అసోసియేట్ గా పనిచేయడమే కాదు, అందులో కామదేవుని పాత్రలో కాసేపు తెరపై కనిపించారు ఉపేంద్ర. రెండు సినిమాలు కాగానే తాను రూపొందించుకున్న కథతో ‘తర్లే నన్ మగ’ చిత్రాన్ని రూపొందించారు. ఈ తొలి ప్రయత్నంలోనే ఉపేంద్రకు దర్శకునిగా మంచి పేరు లభించింది. ‘ష్!’ చిత్రంతో వైవిధ్యం చూపించారు. ఉపేంద్ర దర్శకత్వంలో మూడో చిత్రంగా ‘ఓం’ తెరకెక్కింది. శివరాజ్ కుమార్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. 1995లో టాప్ గ్రాసర్ గానూ ‘ఓం’ రికార్డ్ సృష్టించింది. ‘ఓం’ చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ హీరోగా ‘ఓంకారం’ పేరుతో ఉపేంద్ర దర్శకత్వంలోనే రూపొందించారు.
Also Read
‘ఓంకారం’తోనే తెలుగువారికీ దగ్గరయ్యారు ఉపేంద్ర. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘ఎ’ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులోనూ అనువాదమై అలరించింది. దాంతో ఉపేంద్రకు నటునిగానూ తెలుగునాట క్రేజ్ లభించింది. ఇ.వి.వి. సత్యనారాయణ తన ‘కన్యాదానం’లో ఉపేంద్రను ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంచుకున్నారు. ఈ సినిమా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేక పోయింది. ‘ఉపేంద్ర’ చిత్రం తెలుగు కన్నడ భాషల్లో విజయం సాధించింది. ఆ పై “ఒకే మాట, రా!, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్ సత్యమూర్తి, గని” వంటి తెలుగు చిత్రాల్లో హీరోగానూ, కీలక పాత్రల్లోనూ నటించారు ఉపేంద్ర. ఆయన కన్నడలో హీరోగా నటించిన అనేక చిత్రాలు తెలుగులో అనువాదమై ఎంతగానో మురిపించాయి. ద్విపాత్రాభినయాలతోనూ, త్రిపాత్రాభినయాలతోనూ ఉపేంద్ర ఆకట్టుకున్న తీరే వేరు అని చెప్పవచ్చు.
జనం కోసం మనం అంటూ ప్రజా వాణి వినిపించాలని 2018లో ‘ఉత్తమ ప్రజాకీయ పక్ష’ అనే రాజకీయ పార్టీని ఆరంభించారు. తాను పోటీ చేయకుండా పలువురు అభ్యర్థులను బరిలోకి దింపారు ఉపేంద్ర. అయితే సినిమాల్లోలాగా రాజకీయాల్లో విజయం ఆయనను వరించలేదు. అయినా సరే, జనం పక్షాన నిలచి పోరాడుతూనే ఉంటానని అంటారు ఉపేంద్ర. అభిమానులు మాత్రం ఆయనను ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నారు. దానికి ఇంకొంత సమయం ఉందని అంటున్నారు ఉపేంద్ర. అదెప్పుడో కానీ, అప్పటి దాకా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ఉపేంద్ర అలరిస్తారని ఆశించవచ్చు.
తాజావార్తలు
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
-
Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!