(సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టినరోజు) “నా రూటే సెపరేటు” అంటూ సాగుతున్న నటదర్శకరచయిత ఉపేంద్రకు కన్నడనాట తరగని క్రేజ్! తెలుగునేలపైనా ఉపేంద్రకు ఉన్న ఆదరణ తక్కువేమీ కాదు. నలుగురు నడచిన బాటలో కాకుండా, తనదైన పంథాలో పయనించి నలుగురినీ మెప్పిస్తున్న ఘనుడు ఉపేంద్ర. నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా ఉపేంద్ర పలు పాత్రలు పోషిస్తూనే జనాన్ని ఆకట్టుకుంటున్నారు. డొంక తిరుగుడు లేకుండా, ముక్కుసూటిగా మాట్లాడటం ఉపేంద్ర నైజం. అందుకే ఆయన సినిమాల్లోనూ ఆ విలక్షణం కనిపిస్తూ ఉంటుంది.…