Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2 : లేటు వయసులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా ‘జైలర్’. మాస్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్, అనిరుధ్ సంగీతం, నెల్సన్ దిలీప్‌కుమార్ మార్క్ టేకింగ్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జైలర్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఈ సాయంత్రం బిగ్ అప్డేట్ అయితే రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ‘జైలర్ 2’ విడుదల తేదీని ఈరోజు సాయంత్రం 6 గంటలకు వెల్లడించనున్నారు. ఈ ఒక్క ప్రకటనతోనే సోషల్ మీడియాలో సినిమా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. గత కొద్ది నెలలుగా ఈ సినిమా విడుదలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండగా, ఇప్పుడు వాటికి అధికారికంగా తెరపడనుంది.
ఇప్పటికే సినీ వర్గాల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా ‘జైలర్ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే ప్రచారం సాగుతోంది. పండుగ సీజన్లో విడుదలైతే భారీ ఓపెనింగ్స్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద మరోసారి రజనీకాంత్ మ్యాజిక్ కనిపించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారం నిజమా కాదా అన్నది ఈ సాయంత్రం విడుదల కానున్న అధికారిక ప్రకటనతో స్పష్టత రానుంది. ఈ చిత్రంపై అంచనాలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఇందులో కనిపించనున్న భారీ తారాగణం. రజనీకాంత్‌తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ఎస్.జె. సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే హృతిక్ రోషన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారనే సమాచారం సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని మరింత పెంచింది.
Also Read
- Neha Dhupia: 'ఇదంతా వెంటనే ఆపండి'.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
- Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
- Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
- Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
ఇక అనిరుధ్ రవిచందర్ మరోసారి ఈ సీక్వెల్‌కు సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ‘జైలర్’ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన నేపథ్యంలో, రెండో భాగంలో కూడా అదే స్థాయి మాస్ ఎలివేషన్‌ను అభిమానులు ఆశిస్తున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కూడా కథను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈరోజు సాయంత్రం 6 గంటలకు రానున్న అనౌన్స్మెంట్ తో ‘జైలర్ 2’ ప్రచార కార్యక్రమాలు జోరందుకోబోతున్నట్లే. ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్న ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటన తర్వాత మరింత హైప్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే అభిమానులు మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
The Tiger is back on the hunt! 🔥 Today 6 PM 😎@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial #Jailer2 pic.twitter.com/KQB60JwSEY
— Sun Pictures (@sunpictures) July 2, 2026
తాజావార్తలు
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్‌కు కౌంట్‌డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
-
Somu Veerraju: జగన్‌కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?