The Raajasaab : ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీ గురించి అదిరిపోయే న్యూస్ బయటకొచ్చింది. మూవీ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్ వస్తుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే మూవీ టీజర్ అప్డేట్ రేపు రాబోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.
Read Also : Heroines : వయసు 45 ఏళ్లు దాటినా.. పెళ్లి వద్దంటున్న హీరోయిన్లు..
టీజర్ లోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారంట. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి హర్రర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఆయన ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ తప్ప మూవీ నుంచి ఎలాంటి లుక్ బయటకు రాలేదు. ఇప్పుడు టీజర్ తో అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం జూన్, జులై, ఆగస్టు లో సినిమాలు లాక్ అయి ఉన్నాయి. కాబట్టి ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబర్ లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Ghaati : ఘాటి రిలీజ్ డేట్ వచ్చేసింది
