Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి. కెజిఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. విలన్స్ గా జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటినుంచో ఈ సినిమాపై ఒక స్ట్రాంగ్ బజ్ ఉంది. ప్రశాంత్ నీల్ యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నాడని.. సలార్ లో కెజిఎఫ్ రాఖీ భాయ్ నటిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. సలార్, రాఖీ భాయ్ ఫ్రెండ్స్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తల్లో నిజం ఉందని చెప్పుకొస్తున్నారు.
Upasana: పెళ్లి అయిన వెంటనే మేము వేరు కాపురం పెట్టాం.. కానీ, ఇప్పుడు
కెజిఎఫ్ 2 చివర్లో .. రాఖీ భాయ్ బంగారం మొత్తం తీసుకొని సముద్రంలోకి దూకేస్తాడు. అయితే ఆ సముద్రంలోకి దూకే ముందు అతని ఫ్రెండ్ అయిన సలార్ ను కలిసి మాఫియా మొత్తాన్ని అంతం చేయమని చెప్తాడట. దీంతో ఫ్రెండ్ కోరిక మేరకు ప్రభాస్ .. రంగంలోకి దిగి మాఫియాను అంతం చేయనున్నాడట. చూచాయగా చెప్పాలంటే ఇది సలార్ కథ అని చెప్పుకొస్తున్నారు. ఇందులో ప్రభాస్ విలన్స్ కూడా యాడ్ అవుతారట. అయితే సినిమాలో రాఖీ భాయ్ కూడా కనిపించనున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ తో మాట్లాడినట్లు వాయిస్ ను వినిపించనున్నారని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమే అని చెప్పాలి. ఇకపోతే ఈ చిత్రం సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.