Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను జరుపుకొంటుంది. ఇక తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు హిందీలో ప్రభాస్ తన సొంత గొంతును వినిపిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ప్రభాస్ కొన్ని కారణాల వలన తన సొంత డబ్బింగ్ చెప్పడంలేదట. దీంతో బాహుబలి హిందీకి దబ్బయింగ్ చెప్పిన నటుడు శరద్ కేల్కర్ తోనే డబ్బింగ్ చెప్పించనున్నారట మేకర్స్.
ఇక మరికొన్ని రోజుల్లో ఈ డబ్బింగ్ పనులు మొదలు కానున్నాయట.. శరద్ కేల్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కు ధీటైన విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శరద్ పలు సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు. ఆయన బేస్ వాయిస్ ప్రభాస్ కు చక్కగా సరిపోతుందని బాహుబలికి తీసుకోగా.. ఇప్పుడు కూడా ఆయన్నే కంటిన్యూ చేయమన్నారట. అంటే హీరో ప్రభాస్ అయితే.. ఆయన ఆత్మ అదేనండీ వాయిస్ ఈ హీరోదన్నమాట. ఇక ప్రభాస్ డబ్బింగ్ చెప్పకపోవడానికి కారణం.. తాను సొంతంగా డబ్బింగ్ చెప్పిన రాదే శ్యామ్ సినిమా ప్లాప్ అవ్వడమేనని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.