NTR: దేవర.. ఒక్కరిని తట్టుకోవడమే కష్టం అంటే ఇద్దరా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇట్టే వైరల్ గా మారుతోంది.
Manchu Manoj: మంచు మనోజ్ భార్యను ఇలాంటి పోజ్ లో ఎప్పుడైనా చూశారా..?
Also Read
ఇక తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడట. సముద్ర వీరుడు తండ్రిగా కనిపిస్తున్నాడని కొందరు అంటున్నారు. ఇంకొందరు.. ఒక్కడే రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు అని అంటున్నారు. ఇందులో ఏది నిజం అనేది తెలియదు కానీ, ఖచ్చితంగా ఎన్టీఆర్ ఇద్దరుగా కనిపిస్తున్నాడు అన్నది మాత్రం కన్ఫర్మ్ అయ్యింది. ఇదే కనుక నిజమైతే జాన్వీ తో పాటు మరో హీరోయిన్ కూడా ఈ చిత్రంలో ఉండే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ, నా అల్లుడు లాంటి సినిమాల్లో డబుల్, త్రిబుల్ రోల్స్ చేసి మెప్పించాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. దేవర.. ఒక్కరిని తట్టుకోవడమే కష్టం అంటే ఇద్దరా.?అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!