NTV Telugu Site icon

ఉపాస‌న షార్ట్ ఫిల్మ్.. హీరో ఆయనే?

కరోనా స‌మ‌యంలో వైద్యులు ప్రాణాల‌ను లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయా వైద్యులు, సిబ్బంది మహమ్మారి బారిన పడుతున్నారు. కొంతమంది ఆసుపత్రుల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. మరికొంత మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత దైర్యంగా తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే వారి త్యాగాన్ని అంద‌రికి తెలియ‌జేయాల‌ని భావించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాస‌న వైద్యులపై ఓ షార్ట్ ఫిల్మ్ చేయాల‌ని భావించింద‌ట‌. ఇందులో భ‌ర్త రామ్‌చ‌ర‌ణ్‌ని హీరోగా తీసుకోవాల‌ని అనుకుంటుంద‌ట‌. మరో వైపు యువ హీరో శ‌ర్వానంద్ తో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.