Upasana: మెగా వారసుడు కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. దాదాపు 11 ఏళ్ళ తరువాత రామ్ చరణ్ – ఉపాసన తమ మొదటి బిడ్డను ఆహ్వానిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఉపాసన బిడ్డకు జన్మనిస్తుంది. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యిన దగ్గరనుంచి బిడ్డ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొంటుంది. ఈ మధ్యనే బిడ్డ సంరక్షణ కోసం బొడ్డుతాడును దాచనున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఆమె తనకు పుట్టబోయే బిడ్డకు గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను అందివ్వడానికి రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఉపాసనకు బిడ్డ పుట్టిన వెంటనే.. చరణ్ కుటుంబం.. చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నారట. అంటే.. ఇప్పటివరకు చిరు ఇంట్లో కాదా చరణ్ ఉండేది అంటే.. కాదు. చరణ్- ఉపాసన పెళ్లి అయ్యిన వెంటనే వారి ప్రైవసీకి భంగం కలిగించకుండా వేరే ఇంట్లో ఉండమని చిరు చెప్పారట. అందుకే ఆచార్య సమయంలో చరణ్.. తండ్రిని చాలా మిస్ అవుతున్నాను. ఈ షూటింగ్ తనకు చాలా జ్ఞాపకాలను మిగిల్చింది అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మాత్రం ఈ దంపతులు తమ బిడ్డ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. బిడ్డ పుట్టాకా.. చిరంజీవి ఇంటికి వెళ్లిపోనున్నట్లు ఉపాసన తెలిపింది.
Lust Stories 2: ఈ సిరీస్ లో హీరోయిన్లు ఉంటారు మాస్టారూ .. బీభత్సం అంతే
” సాధారణంగా ఏ దంపతులు అయినా పిల్లలు పుట్టాకా వేరు కాపురం పెడతారు. కానీ, మేము పెళ్లి అయిన వెంటనే మేము అత్తయ్య మామయ్యలతో కలిసి ఉండలేదు. ఇక ఇప్పుడు మా బిడ్డకు గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను అందివ్వాలనుకుంటున్నాం. అందుకోసం చిరంజీవి మామయ్య ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. మేము ఇద్దరం మా గ్రాండ్ పేరెంట్స్ తోనే పెరిగాం. మా ఎదుగుదలలో వారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మా పిల్లలకు కూడా వారి గ్రాండ్ పేరెంట్స్ మధ్యనే పెంచాలనుకుంటున్నాం. వారి దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకోవాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని చెప్పుకొచ్చింది. ఇక ఉపాసన తీసుకున్న నిర్ణయానికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈరోజుల్లో ఇలాంటి కోడళ్ళు దొరకడం చాలా అరుదు.. సూపర్ ఉపాసన అంటూ కామెంట్స్ పెడుతున్నారు.