Site icon NTV Telugu

Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్

Charan

Charan

Upasana: టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో రామ్ చరణ్- ఉపాసన జంట ఒకరు. మెగా ఇంటి కోడలిగా ఉపాసన వచ్చిన దగ్గరనుంచి చరణ్ అన్ని పనులు ఆమె చూసుకొంటూ ఉంటుంది. ఇక చరణ్ కు కొద్దిగా తీరిక దొరికినా ఉపాసనతో టూర్స్ కు చెక్కేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం తెల్సిందే. దీంతో ఆమెను మెగా కుటుంబం కంటికి రెప్పలా చూసుకొంటుంది. షూటింగ్ నుంచి రావడం ఆలస్యం చరణ్, ఉపాసనతోనే సమయం గడుపుతున్నాడు. ఏ ఈవెంట్ కు అయినా ఇద్దరు జంటగా వెళ్తూ ఉంటారు. అంత అనోన్య దంపతులు చరణ్- ఉపాసన. ఇక ఈ జంట అంటే అభిమానులకు కూడా ఇష్టమే. ముఖ్యంగా చరణ్ అభిమాను ఉపాసనను వదినమ్మ అంటూ ప్రేమగా పిలుస్తారు. చరణ్ ఫోటోలు, వీడియోలు కావాలని ఆమెను అడుగుతూ ఉంటారు. అభిమానుల కోరిక మేరకు ఉపాసన మిస్టర్ సి క్యూట్ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Anushka: స్వీటీకి ఆ జబ్బు ఉందంట.. 20 నిముషాలు బ్రేక్ కూడా లేకుండా

ఇక తాజాగా ఈ జంటకు సంబంధించిన ఒక ఫన్నీ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఒక అభిమాని. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముంది అంటే.. ఒక ఈవెంట్ లో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, ఉపాసన పక్క పక్కన కూర్చున్నారు. సోఫా ముగ్గురికి సరిపోక పోవడంతో చరణ్, ఉపాసనను పక్క సోఫాలో కూర్చోమని చెప్తాడు. అందుకు ఉపాసన పక్క సీట్ లోకి వెళ్లి కూర్చోగానే చరణ్, తేజ్ నవ్వుకుంటారు. ఇక ఈ వీడియోకు రివెంజ్ అంటూ మరో వీడియోను జత చేశారు. ఆ వీడియోలో చరణ్.. ఇంట్లో గిన్నెలుతోమడం, ఇల్లు ఊడవడం, బట్టలు ఆరేయడం, చివరికి కాఫీ పెట్టి.. సోఫాలో కూర్చున్న ఉపాసనకు ఇవ్వడంతో వీడియో పూర్తవుతుంది. అక్కడ సోఫాలో నుంచి తనను లేపినందుకు ఉపాసన, భర్తపై రివెంజ్ తీర్చుకుందని క్యాప్షన్ పెట్టుకొచ్చారు. చూడడానికి ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ పగలపడి నవ్వుకుంటున్నారు.

Exit mobile version