NTV Telugu Site icon

Ram Charan: అల్లుడి పాటకు స్టెప్పులేసిన అత్త.. లవ్ యూ అన్న కూతురు

Charan

Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డులను అందుకునేలా చేస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ గ్లోబల్ గ్లోబ్స్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. దీంతో చిన్నా లేదు.. పెద్దా లేదు.. ప్రతి ఒక్కరు ఈ సాంగ్ హుక్ స్టెప్స్ వేసి శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ అత్త.. ఉపాసన తల్లి శోభనా కామినేని సైతం ఈ సాంగ్ కు స్టెప్స్ వేసి అలరించారు. అల్లుడి పాటకు స్టెప్ వేయడమే కాకుండా ఆయన నటించిన చిత్రానికి అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఇక తన తల్లి.. తన భర్త సాంగ్ కు స్టెప్పులు వేయడంతో ఉపాసన మరింత సంబరపడింది. ఆ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్న తల్లికి లవ్ యూ చెప్పింది. అంతేకాకుండా అత్తగారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దాదాపు పదేళ్ల తరువాత రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కానున్నారు. దీంతో మెగా వారసుడు కోసం మెగా ఫ్యామిలీనే కాదు మెగా అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Show comments