Site icon NTV Telugu

Upasana Konidela: ప్రతి ఆడదాని సక్సెస్ వెనుక ఒక మగాడు ఉంటాడు..

Upsi

Upsi

Upasana Konidela: ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా కోడలిగా, చరణ్ భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా తన భుజాల మీద వేసుకుంది. ఒక బిజినెస్ వుమెన్ గా సక్సెస్ ఫుల్ గా వ్యాపార రంగాల్లో అడుగుపెట్టి తన సత్తా చాటుతుంది. ఇక ఈ ఏడాది తల్లిగా మారి.. కొత్త బంధంలోకి అడుగుపెట్టింది. క్లింకార తో ఎక్కువ సమయం గడుపుతూ తల్లిగా మధురానుభూతులను అందుకుంటుంది. నిత్యం చరణ్ కు సపోర్ట్ గా నిలబడుతుంది. ఇక ఉపాసనాలానే చరణ్ సైతం తన భార్యను ఎంతో ప్రేమిస్తాడు. ఎన్ని పనుల్లో ఉన్నా.. ప్రతి ఏడాది ఉపాసనతో వెకేషన్ కు వెళ్తుంటాడు. ఆమె చేసీ ప్రతి పనిలో సపోర్ట్ గా నిలబడతాడు. ఉపాసన ప్రగ్నెంట్ గా ఉన్న సమయంలో చరణ్ షూటింగ్ కు బ్రేక్ తీసుకొని తనతోనే ఎక్కువ సమయం కేటాయించాడు.

ఇక ఈమధ్యనే మెగా కపుల్ ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై వచ్చారు. ఇప్పటివరకు ఏ కపుల్ ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకోలేదు. ఈ మ్యాగజైన్ లో ఉపాసన, చరణ్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇక తాజాగా ఈ కవర్ పేజీ గురించి ఉపాసన ట్వీట్ చేసింది. “ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అందరూ అంటుంటారు. నేనేమంటానంటే.. ప్రతి మహిళ విజయం వెనుక ఆమెకు అండగా, రక్షణగా నిలబడే ఒక మగవాడు ఉంటాడు” అంటూ రామ్ చరణ్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు సూపర్ మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version