Site icon NTV Telugu

Upasana Konidela: రాజకీయాల్లో వారికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు.. వెనక్కు లాగొద్దు

Upasana

Upasana

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా అడుగుపెట్టిన దగ్గరనుంచి ఆమె తన బాధ్యతలను ఎంతో ప్రేమతో నిర్వర్తిస్తూ వస్తుంది. ఇక ఈ మధ్యనే తల్లిగా ప్రమోట్ అయిన ఉపాసన మరింత బాధ్యతలను అందుకుంది. ఒకపక్క భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది. ఇవే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ప్రతి వార్తపై కూడా ఆమె తన స్పందనను తెలియజేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన.. కోలీవుడ్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేసింది. మంచి సినిమాలు తీసి మెప్పించిన విజయ్.. ఇప్పుడు సమాజానికి సేవ చేయాలనుకోవడం మంచి విషయమని తెలిపింది.

“సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది రాజకీయాల్లో రాణించారు. ముఖ్యమంత్రులుగా సేవలు చేశారు. తమిళనాడులో ఒక హీరోగా విజయ్ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు సమాజానికి సేవ చేయాలనుకోవడం మంచి విషయం. సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకునే లీడ్‌ర్‌ ఎవరున్నా సపోర్ట్ చేయాలి. ఎవరైనా సరే అలాంటివారిని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు.. కానీ, వెనక్కి మాత్రం లాగకూడదు. విజయ్ మంచి రాజకీయ నాయకుడు అవుతాడని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో పాటు తనకు రాజకీయాలు పడవని, తానెప్పుడూ రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version