మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో అగ్రెసివ్ గా పాల్గొంటున్నాడు. ఇంటర్వ్యూస్, ఈవెంట్స్, ఫాన్స్ మీట్, సెలబ్ మీట్స్… ఇలా అవకాశం ఉన్న ప్రతి చోటుకి వెళ్తున్న చరణ్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యాడు. ఇటివలే లాస్ ఏంజిల్స్‌లోని పారమౌంట్ పిక్చర్స్ స్టూడియోస్‌లో ప్రియాంక చోప్రా (మలాల యూసఫ్ జైతో కలిసి) హోస్ట్ చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి రామ్ చరణ్ అటెండ్ అయ్యాడు. సౌత్ ఏషియా నుంచి కొన్ని సినిమాలు ఆస్కార్ కి నామినేట్ అయిన సందర్భంగా పారామౌంట్ ఈ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో సౌత్ ఏషియా యాక్టర్స్, టెక్నిషియన్స్, ఆస్కార్ నామినీస్, ఇతర సెలెబ్రిటీలు పాల్గొన్నారు. రామ్ చరణ్ తో ఉపాసన పాటు ఈ పార్టీకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపాసన, ప్రియాంకు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధన్యవాదాలను తెలియజేశారు. ‘‘మాకు అండగా నిలిచేందుకు వచ్చిన ప్రియాంకకు కృతజ్ఞతలు,” అని తెలిపారు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రాతో కలిసి దిగిన ఫొటోలను ఉపాసన షేర్ చేసింది. ఉపాసన షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీకి ఎన్టీఆర్ కూడా అటెండ్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యాడు. అంజుల ఆచార్య, మిండి కలింగ్, కుమైల్ నంజైని, కల్ పెన్, అజీజ్ అన్సారీ, బెలా బజ్రియా, రాధికా జోన్స్, జోసెఫ్ పటేల్, శ్రుతీ గంగూలీ, అనితా ఛటర్జీ తదితరులు పారామౌంట్ పార్టీలో పాల్గొన్నారు.
