NTV Telugu Site icon

Upasana Konidela: 60 ఏళ్ళ వయస్సులో అత్తమ్మ బిజినెస్.. కోడలు ఎంకరేజ్ మెంట్ మాములుగా లేదే

Ups

Ups

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క మంచి బిజినెస్ విమెన్ గా ఉంటూనే.. ఇంకోపక్క కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక ఈ కాలంలో ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయి.. ఏడాది కూడా నిండకుండానే అత్తతో పోరు పడలేకపోతున్నాను అంటూ వేరు కాపురం పెడుతుంది. కానీ, ఉపాసన మాత్రం మా అత్త బంగారం అంటూ మురిసిపోతూ ఉంటుంది. అందుకు కారణం.. సురేఖ. తన ఇద్దరు కూతుర్లతో సమానంగా కోడలిని కూడా చూసుకుంటుంది. ఇక పెళ్ళికి ముందు చరణ్ – ఉపాసన బయట ఉన్నా కూడా.. క్లింకార పుట్టాకా.. నాన్నమ్మ, తాతయ్యల ప్రేమను అందించడానికి చిరుఇంట్లోనే ఉంటున్నారు. ఏ కోడలు అయినా.. అత్తా బిజినెస్ పెడుతున్నాను అంటే.. ఈ వయస్సులో ఎందుకు అని అంటారు. కానీ, ఉపాసన మాత్రం నేను మీకెప్పుడు తోడుగా నిలబడతాను అని చెప్పుకొచ్చింది.. అంతేకాకుండా సురేఖ కొత్త బిజినెస్ లో హెల్ప్ చేస్తూ బెస్ట్ కోడలు అని రుజువు చేసుకుంటుంది కూడా.

ఇక ఈ మధ్యనే సురేఖ.. అత్తమ్మాస్ కిచెన్ అని ఒక ఆన్లైన్ స్టోర్ ను ప్రారంభించారు. ఇందులో ఇన్స్టాంట్ రసం, సాంబారు, పులిహోర పొడులను అమ్ముతున్నారు. సురేఖ, చిరు తల్లి అంజనా ఎలా అయితే.. మెగా ఫ్యామిలీకి వండి పెడుతున్నారో.. అవే వంటలను ఇలా పొడులు రూపంలో తయారుచేసి.. ప్రజలకు అందిస్తున్నారు. ఇక నేడు ఉమెన్స్ డే సందర్భంగా.. అత్తమ్మను కోడలు మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా అత్తగారు 60 వ ఏట అత్తమాస్ కిచెన్ ద్వారా వ్యాపారవేత్తగా అరంగేట్రం చేస్తున్నారు.మీ అభిరుచిని అనుసరించినందుకు అత్తమ్మా మీకు వందనాలు, మీరు నిజంగా ఒక ఇన్స్పిరేషన్. మరికొంతమంది అత్తమ్మలు, అమ్మలు పారిశ్రామికవేత్తలైతే మన దేశం ఎంత సంపన్నంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరడం మరియు వారి అభిరుచిని అనుసరించాలని కోరుకుందాం” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.