Site icon NTV Telugu

Upasana Konidela: కూతురుతో కలిసి మొదటిసారి వరలక్ష్మీ వ్రతం చేసిన ఉపాసన.. ఫోటో వైరల్

Upasana

Upasana

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఆమె పేరే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు పదేళ్ల తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన గర్భవతి అని తెలిసినప్పటినుంచి పాప పుట్టేవరకు కూడా నిత్యం ఆమె గురించి ఏదోక వార్త వస్తూనే ఉంది. ఇక ఈ మధ్యనే మెగా ఇంటికి వారసురాలు వచ్చేసింది. రామ్ చరణ్‌, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేస్తున్నట్లు మెగాస్టార్ రివీల్ చేసిన విషయం కూడా తెల్సిందే. ఇక క్లీంకార రాకతో మెగా ఇంట కొత్త కళ వచ్చేసింది. ఆగస్టు 22 న చిరు పుట్టినరోజున. చిరుత(చిరు తాత) తో కలిసి నవ్వులు చిందించిన క్లీంకార.. నేడు.. తల్లి ఉపాసనతో కలిసి పూజ చేసింది. ఇప్పుడప్పుడే క్లీంకార ఫోటోను షేర్ చేయకూడదని ఉపాసన.. ముఖం చూపించకుండా జాగ్రత్తపడుతుంది.

Priyanshu Singh: పునీత్ నన్ను రెండు సార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు.. నటి సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఉపాసన కూతురు పుట్టాకా మొదటి వరలక్ష్మీ వ్రతం జరుపుకుంద. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రెడ్ కలర్ డ్రెస్ లో ఉపాసన ట్రెడిషనల్ లుక్ లో ఉండగా .. వెనుక దేవుడి పటాలతో అలంకరణ అద్భుతంగా ఉదని. చిన్నారి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడిన్న ఉపాసన.. ” ఎక్కువ అడగలేదు.. మొదటిసారి నా కూతురు క్లీంకారతో వరలక్ష్మీ వ్రతం చేస్తున్నా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. క్లీంకార ఫేస్ చూపించమని అడుగుతున్నారు.

Exit mobile version