NTV Telugu Site icon

Upasana Konidela: బేబీ బంప్‌తో మెగా ఇంటి కోడలు.. ఫోటోలు వైరల్

Upasana Konidela

Upasana Konidela

Upasana Konidela: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని రామ్‌చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మెగా అభిమానులు ఈ శుభవార్త కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు ఈ విషయం ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్‌ల్యాండ్ వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలలో ఉపాసన బేబీ బంప్‌తో కనిపిస్తోంది. ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలలో ఉపాసన తల్లిదండ్రులు కూడా కనిపిస్తున్నారు.

Read Also: Kushi: రీరిలీజ్ కి రెడీ అయిన క్లాసిక్ లవ్ స్టొరీ…

కాగా అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్‌రెడ్డి మనవరాలు ఉపాసనతో 2012 జూన్‌లో రామ్‌చరణ్ వివాహం జరిగింది. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. చెన్నైలో ఉండే సమయంలో చరణ్, ఉపాసన ఒకే స్కూలులో చదువుకున్నారు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే వీరిది ప్రేమ వివాహం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఉపాసన తనకు తెలుసు కాబట్టి ఆమెను పెళ్లి చేసుకునేందుకు చరణ్ ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేదు. అయితే వీళ్లకు ఇప్పటివరకు సంతానం లేకపోవడంతో మెగా అభిమానులు శుభవార్త కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఈ పదేళ్లలో ఉపాసన ఎక్కడికి వెళ్లినా పిల్లలు ఎప్పుడు అంటూ ఎన్నో ప్రశ్నలు ఆమెను చుట్టుముట్టేవి. ఇది తమ వ్యక్తిగత విషయం అని తెలిసినా మీడియా మాత్రం పదేపదే ఈ విషయం అడిగి ఉపాసనను ఇబ్బంది పెట్టేది. అయినా ఉపాసన ఎలాంటి విసుగు లేకుండా సమాధానం చెప్పేది. సంతానం విషయంలో ఉపాసన మాటకు విలువ ఇచ్చి చరణ్ కూడా వెయిట్ చేశాడు. ఎట్టకేలకు ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడంతో సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ప్రకటించి తమ అభిమానుల్లో సంతోషం నింపారు.

Show comments