Site icon NTV Telugu

వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు

upasana

upasana

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేసిందంటూ ఉపాసనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ వేదికగా ఉపాసనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసనపై నెటిజన్లు అంతగా ఆగ్రహం చెందడానికి కారణమైన ఆ పోస్ట్ ఏమిటంటే ?

Read Also : థియేటర్లలోకి ‘అఖండ’ తమిళ వెర్షన్

జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపాసన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాసన తన ఫేస్‌బుక్ పేజీలో ఒక ఆలయ గోపురం ఫోటోను షేర్ చేసింది. గుడి గోపురంపై ఉన్న దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్యులు నిల్చున్నట్లుగా ఆ ఫొటోను ఎడిట్ చేశారు. గోపురంపై నిలబడి ఉన్న వాళ్లలో తాను, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నారని వెల్లడించింది. ఆ ఫోటో తనకు బాగా నచ్చిందని, దాన్ని ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ తనకు డైరెక్ట్ మెసేజ్ పెడితే అభినందించాలని ఉపాసన రాసింది.

ఉపాసన షేర్ చేసిన ఫోటోకు నెటిజన్ల నుంచి ఊహించని సమాధానాలు వచ్చాయి. మీరు ఎంత గొప్పవారైనా దేవుడి గోపురాన్ని ఇలా అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకోవడం తగదని, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని విమర్శించారు. మరో నెటిజన్ ఫోటో తీసిన కళాకారుడిని ప్రశంసించడం కంటే, వేల సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని నిర్మించిన కళాకారులను గుర్తుంచుకోండి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చిన సందేశం ఏమిటి? ఈ ఫోటోను షేర్ చేసి భారతీయులను అవమానించడం ఎందుకు? ఆ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేయాలని కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version