Site icon NTV Telugu

Upasana : గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు… చెర్రీ కోసమే !

Upsana

Upsana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కన్పించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన “కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC15 Rc షూటింగ్ లో బిజీగా ఉండడం మూలంగా, ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే ప్రత్యేక హక్కు, అవకాశం నాకు లభించింది. రామ్ చరణ్, నేను మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాము. వినయంతో అంగీకరిస్తున్నాను” అంటూ గోల్డెన్ టెంపుల్ లోని ప్రత్యేక పూజ విషయాన్ని వెల్లడించింది. “ఆర్ఆర్ఆర్” రిలీజ్ కు ముందు రామ్ చరణ్, తారక్, రాజమౌళి అండ్ టీం అంతా గోల్డెన్ టెంపుల్ ని సందర్శించిన విషయం తెలిసిందే.

Read Also : Narayan Das K Narang : ప్రముఖ నిర్మాత కన్నుమూత

RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్‌ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కథను కార్తీక్ సుబ్బరాజ్ రాయగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version