NTV Telugu Site icon

Unstoppable with NBK : బాలకృష్ణ డైలాగ్ చెప్పిన రణ్ బీర్ కపూర్..

Whatsapp Image 2023 11 15 At 6.06.35 Pm

Whatsapp Image 2023 11 15 At 6.06.35 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్‌. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో డిసెంబర్‌ 1 న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.తాజాగా రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా, సందీప్‌ రెడ్డి టీం అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే షో లో సందడి చేసింది. బాలకృష్ణ తో హీరోహీరోయిన్లు ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ కూడా చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌ ఎంట్రీలోనే ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు.. డైలాగ్‌ చెప్పగా సెట్స్‌ అంతా ప్రశంసలతో ముంచెత్తినట్లు సమాచారం.

అలాగే రణ్‌బీర్‌ కపూర్ తాత రాజ్‌కపూర్‌, తన తండ్రి ఎన్టీఆర్‌ గతంలో ఎలాంటి అనుబంధం కొనసాగించేవారో కూడా చెప్పుకొచ్చారట బాలకృష్ణ. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ ఎప్పుడనే దానిపై ఆహా త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.ఆహా లో స్ట్రీమింగ్‌ కాబోయే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ను చాలా వినోదాత్మకంగా డిజైన్ చేసినట్టు సమాచారం.. యానిమల్‌ చిత్రంలో బాబీ డియోల్‌ మరియు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్‌ ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అలాగే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో సూపర్ థ్రిల్ అందించేలా యానిమల్‌ ఉండబోతుందని తెలుస్తుంది.. యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌ మరియు మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన నాన్న నువ్‌ నా ప్రాణం లిరికల్‌ సాంగ్‌ తో పాటు మిగిలిన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది.తండ్రీ కొడుకులైన అనిల్ కపూర్‌-రణ్‌బీర్‌ కపూర్‌ మధ్య వచ్చే సన్నివేశాల తో ఎమోషనల్‌ టచ్‌ తో సాగుతున్న ఈ పాట అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.