Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తోంది. ఏ టాక్ షోకు లేని రికార్డ్ ను అన్ స్టాపబుల్ సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న ప్రభాస్ ఎపిసోడ్ తో ఈ షో దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. స్టార్లు, పొలిటికల్ లీడర్స్, హీరోయిన్స్ తో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ జనవరిలో ఈ షో సంచలనాలు కాదు ప్రకంపనలు సృష్టించడం ఖాయం.. ఎందుకంటే.. ఈ నెల స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్ ల లిస్ట్ ను ఆహా రిలీజ్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా రిలీజ్ చేసున్నట్లు ప్రకటించిన ఆహా.. రెండో పార్ట్ ను జనవరి 6 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇక సంక్రాంతికి పవన్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేస్తారు అనుకున్నారు అభిమానులు.. కానీ పవన్ ఎపిసోడ్ ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మధ్యలో వచ్చే ఎపిసోడ్ కోసం బాలయ్య రంగంలోకి దిగాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే. దీంతో ఆ వారం ఎపిసోడ్ లో వీరసింహారెడ్డి చిత్ర బృందం సందడి చేయనున్నారట. గోపీచంద్ మలినేని, హీరోయిన్ శృతి హాసన్ తో బాలయ్య అటు హోస్ట్ గా ఇటు హీరోగా రచ్చ చేయడానికి రెడీ అయ్యాడు. జనవరి 13 న వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మరి బాలయ్య ట్విస్ట్ బానే ఉంది కానీ.. సంక్రాంతి కైనా పవన్ టీజర్ కానీ, స్పెషల్ గ్లింప్స్ లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తే బావుంటుందని అభిమానులు కోరుతున్నారు. మరి అభిమానుల కోరికను ఆహా మన్నిస్తుందో లేదో చూడాలి.
