Unstoppable Limited Edition Announcement: నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారి చేసిన అన్ స్టాపబుల్ మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ గా సంగతి తెలిసిందే. ఆహా వీడియో యాప్ కోసం నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ లేని విధంగా పోస్ట్ అవతారం ఎత్తడమే కాదు పూర్తిస్థాయిలో ఆహా యాప్ మొత్తానికి ఒక క్రేజ్ తీసుకొచ్చారు. ఒకానొక దశలో ఆహా యాప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఈ షో వల్ల పెరిగాయి అంటే ఎంతలా ఇది ప్రేక్షకులను ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు బాలకృష్ణలోని ఒక కోణాన్ని మాత్రమే చూస్తూ వచ్చిన ప్రేక్షకులు ఈ షో ద్వారా ఆయనలో ఉన్న మరో కోణాన్ని కూడా చూసి ఆయనకు ఫిదా అయిపోయారు. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లు పూర్తయిన ఈ షోకి సంబంధించిన మూడో సీజన్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Boyapati: రాళ్లు తీసుకుని కొడతారురా బాబూ.. బోయపాటి లాజిక్కు భలే ఉందే!
ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తయ్యాయని విజయదశమి రోజు షూటింగ్ మొదలుపెట్టి మూడో సీజన్ ఎపిసోడ్లు వదులుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆహా వీడియో సంస్థ ఒక వీడియో రిలీజ్ చేసింది. గతంలో నందమూరి బాలకృష్ణ మొదటి రెండు సీజన్లకు సంబంధించిన షూటింగ్ విజువల్స్ తో ఒక ప్రోమో కట్ చేసి కొన్ని డైలాగులతో కలిపి రిలీజ్ చేసింది. త్వరలోనే ఈ షో ప్రారంభం కాబోతోంది అంటూ హింట్ ఇచ్చేసింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల ఆయన కుమార్తె పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.